వెస్టిండీస్ తో రెండో టెస్ట్: నిలకడగా భారత్ బ్యాటింగ్
మూడో వికెట్ కి కెప్టెన్ కోహ్లీ, మయంక్ అగర్వాల్ అర్థ సెంచరీ భాగస్వామ్యం భారత జట్టుకు గౌరవప్రదమియన్ స్థితికి చేర్చేలా చేస్తే.. ఆటముగిసేసమయానికి పంత్ తొ కల్సి హనుమ విహారి ఇన్నింగ్స్ ను నిలకడగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో వెస్టిండీస్ తొ శుక్రవారం మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ఐదు వికెట్లకు 264 పరుగులు చేసింది.
వెస్టిండీస్‌తో ప్రారంభమైన రెండో టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అర్థ సెంచరీలు సాధించడంతో భారత జట్టు తొలిరోజు ఆట ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.
టాస్ గెలిచి విండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆ జట్టు కెప్టెన్ హోల్డర్ బౌలింగ్ లో రాణించాడు. మూడు వికెట్లు తీసి భారత జట్టును ఇబ్బంది పెట్టాడు. ఇక తొలిసారి విండీస్ జట్టు తరఫున బరిలోకి దిగిన భారీ క్రికెటర్.. ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ రకీమ్ కార్న్‌వాల్ తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. ఆరున్నర అడుగులు, 140 కిలోల బరువున్న కార్న్‌వాల్ ఈ మ్యాచ్ లో అందరి దృష్టినీ ఆకర్షించాడు. మరోవైపు భారత జట్టు తరపున తోలి టెస్ట్ లో మంచి స్కోరు చేసి టీమిండియా విజయంలో ముఖ్యపాత్ర పోషించిన వైస్ కెప్టెన్ రహానే ఈ మ్యాచ్ లో నిరాశ పరిచాడు. ఇక కోహ్లీ, మయాంక్ లు అర్థ సెంచరీలు సాధించినా వాటిని భారీస్కోరులుగా మరల్చలేకపోవడం నిరుత్సాహ పరిచింది. ఆట ముగిసేసరికి హనుమ విహారి (42), రిషబ్ పంత్ (27) క్రీజులో ఉన్నారు.
హోల్డర్ తన తొలి ఓవర్లోనే రాహుల్‌ను ఔట్ చేశాడు. అతని బౌలింగ్లో కార్న్ వాల్ స్లిప్స్ లో మంచి క్యాచ్ తొ రాహుల్ ను పెవిలియన్ చేర్చాడు. పుజారా కార్న్ వాల్ స్పిన్ ను అంచనావేయలేక బోల్తా పడ్డాడు. ఈ సమయంలో కోహ్లీ, మయాంక్ భారత బ్యాటింగ్ ను గాడిలో పెట్టారు. మూడో వికెట్ కు కీలకమైన 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈదశలో హోల్డర్ మళ్లీ ఈ జంటను విడదీశాడు. అతని బౌలింగ్లో మయాంక్ స్లిప్ లో కార్న్ వాల్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తరువాత వైస్ కెప్టెన్ రహానే కీమార్ రోచ్ బౌలింగ్లో కీపర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేర్చాడు.
అర్ధసెంచరీతో ఊపుమీదున్న కోహ్లిని ఓ చక్కటి బంతితో హోల్డర్ పెవిలియన్‌కు పంపించాడు. దీంతో 202 పరుగులకే భారత్ ఐదు వికెట్లను చేజార్చుకుంది. ఈ క్రమంలో తెలుగు తేజం హనుమ విహారీ జట్టు బాధ్యతా యుతంగా ఆడుతూ పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను తీసుకు వెళుతున్నాడు. రెండోరోజు శనివారం ఆటతీరుపై భారత జట్టు స్కోరు ఆధారపడి ఉంది.




