ఇండియా విజయానికి సిద్ధం : నాలుగోరోజే ముగించేస్తారా?

ఇండియా విజయానికి సిద్ధం : నాలుగోరోజే ముగించేస్తారా?
x
Highlights

వెస్టిండీస్ టూర్ లో ఇప్పటికే అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చూపించిన టీమిండియా ఇప్పుడు టెస్ట్ లలోనూ విజయకేతనం ఎగురవేస్తోంది. రెండు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ ఆడుతున్న భారత్ విజయం ముంగిట నిలిచింది. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్ తొ పాటు సిరీస్ కూడా గెలిచే చాన్స్ కొట్టేసింది టీమిండియా.

వెస్టిండీస్ తొ టెస్ట్ సిరీస్ లో భాగంగా చివరిది రెండోది అయిన టెస్ట్ మ్యాచ్ లో విజయానికి అతి చేరువలో భారత్ జట్టు నిలిచింది. ఆదివారం మొదటి ఇన్నింగ్స్ భారత స్కోరును చేదించే క్రమంలో 117 పరుగులకే కుప్పకూలింది విండీస్ బ్యాటింగ్ లైనప్. ఆ జట్టుకు ఫాలో ఆన్ అవకాశం ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన భారత జట్టు నాలుగు వికెట్లకు 168 పరుగుల స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో.. విండీస్ విజయలక్ష్యం 468 పరుగులు చేయడానికి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే, ఆట ముగిసే సమయానికి 45 పరుగులు మాత్రమె చేసి రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప విండీస్ గెలిచే అవకాశం లేనేలేదు. కాగా, విజయానికి ఎనిమిది వికెట్లు తీయాల్సిన స్థితిలో భారత్ ఉంది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలివున్న నేపధ్యంలో పరిస్థితి చూస్తుంటే..నాలుగోరోజే టీమిండియా మ్యాచ్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విహారి.. రెండో ఇన్నింగ్స్ లోనూ అదే జోరు!

టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో శతక వీరుడు హనుమ విహారి.. రెండో ఇన్నింగ్స్ లోనూ అదేజోరు కొనసాగించాడు. అతనికి రహానే కూడా తోడయ్యాడు. వీరిద్దరూ అజేయ అర్థ సెంచరీలతో విరుచుకు పడ్డారు. దాంతో భారత్ జట్టు 168 పరుగులు చేసింది. ఈ దశలో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు కెప్టెన్ కోహ్లే. మొదటి ఇన్నింగ్స్ లో 299 పరుగుల ఆధిక్యం.. రెండో ఇన్నింగ్స్ 168 పరుగులు మొత్తం కలిపి 468 పరుగుల భారీ లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచింది టీమిండియా.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories