కష్టాల్లో వెస్టిండీస్: హనుమ 'శతక' విహారం.. బుమ్రా హ్యాట్రిక్ దుమారం!

కష్టాల్లో వెస్టిండీస్: హనుమ శతక విహారం.. బుమ్రా హ్యాట్రిక్ దుమారం!
x
Highlights

తెలుగు తేజం హనుమ విహారి శతకంతో విరుచుకుపడిన వేళ.. బూమ్..బూమ్..బుమ్రా హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిన సందర్భం.. వెస్టిండీస్ జట్టు వద్ద సమాధానమే లేకుండా పోయింది. బౌలింగ్ లో తొలిరోజు ఆట ప్రారంభంలో భారత్ ను ఇరకాటంలో పెట్టేలా కనిపించిన వెస్టిండీస్ క్రమేపీ భారత బ్యాట్స్ మెన్ దూకుడుకు తలొగ్గింది.

తెలుగు తేజం హనుమ విహారి శతకంతో విరుచుకుపడిన వేళ.. బూమ్..బూమ్..బుమ్రా హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిన సందర్భం.. వెస్టిండీస్ జట్టు వద్ద సమాధానమే లేకుండా పోయింది. బౌలింగ్ లో తొలిరోజు ఆట ప్రారంభంలో భారత్ ను ఇరకాటంలో పెట్టేలా కనిపించిన వెస్టిండీస్ క్రమేపీ భారత బ్యాట్స్ మెన్ దూకుడుకు తలొగ్గింది. ఇక రెండోరోజు బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ వీరులు బుమ్రా బంతులకు గింగిరాలు తిరిగిపోయారు. కేవలం 33 ఒవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 87 పరుగులు మాత్రమే చేశారు. ఇందులో ఆరు వికెట్లు బుమ్రా ఖాతాలోకే వెల్లడం విశేషం. అందులోనూ ఒక హ్యాట్రిక్ కూడా ఉంది.

వెస్టిండీస్‌తో జమైకా వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో విండీస్ జట్టు కాకవికలయ్యింది. రెండో రోజు ఆట ముగిసేసరికి ఆ జట్టు ఫాలో ఆన్ ప్రమాదంలో పడింది. ఆటలో రెండో రోజైన శనివారం ఓవర్‌నైట్ స్కోరు 264/5తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియా.. హనుమ విహారి (111: 225 బంతుల్లో 16x4) సెంచరీ, ఇషాంత్ శర్మ(57: 80 బంతుల్లో 7x4)కెరీర్ మొదటి అర్థసెంచరీల సహాయంతో 416 పరుగులకి ఆలౌటైంది. భారత్ ఆలౌట్ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ జట్టు జస్‌ప్రీత్ బుమ్రా (6/16) హ్యాట్రిక్ దెబ్బకి శనివారం ఆట ముగిసే సమయానికి 87/7తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది.

తొలి టెస్టులో కొద్దిలో సెంచరీ చేజార్చుకున్న తెలుగు క్రికెటర్ హనుమ విహారి ప్రతికూల పరిస్త్తితుల్లో బ్యాటింగ్ కి దిగాడు. రెండోరోజు శనివారం పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. వ్యక్తిగత స్కోరు 42 వద్ద తన ఇన్నింగ్స్‌ని కొనసాగించిన విహారి.. ఏ దశలోనూ సహనం కోల్పోకుండా.. నిదానంగా తనపని చేసుకుంటూ పోయాడు. అతనికి కొద్ది సేపు సహకారం అందించిన రిషబ్ పంత్ (27), రవీంద్ర జడేజా (16) వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. అయినా, విహారి తన ఏకాగ్రతను కోల్పోలేదు. 8వ వికెట్‌కి ఇషాంత్ శర్మతో కలిసి 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుని తిరుగులేని స్థితిలో నిలిపి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. విండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 5వికెట్లు, రకీమ్ కార్న్‌వాల్ 3 వికెట్లు పడగొట్టారు.

బుమ్రా మ్యాజిక్..

తమ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ ను బుమ్రా చావుదెబ్బ కొట్టాడు. తొలుత ఓపెనర్ బ్రాత్‌వైట్ (10)ని పెవిలియన్ చేర్చిన బుమ్రా తరువాత ఎక్కడా తగ్గలేదు. నిప్పుల్లాంటి బంతులతో వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ ని ముప్పుతిప్పలు పెట్టాడు. మరో ఓపెనర్ కెంప్‌బాల్ (2) వికెట్ దొరకపుచ్చుకున్నాడు. అనంతరం డారెన్ బ్రావో (4) ని బోల్తాకొట్టించాడు. ఇక్కడ నుంచి వరుసగా బ్రూక్స్ (0), రోస్టన్‌ఛేజ్ (0) వికెట్లు పడగోట్టి హ్యాట్రిక్ సాధించాడు. అటు తరువాత కొద్దిగా ఆడుతున్నాడు అనుకున్న జేసన్ హోల్డ్ (18) పెవిలియన్ చేర్చాడు. ఇక మరోవైపు చక్కని బంతులతో బుమ్రాకి సహకరించిన షమీ హెట్‌మెయర్ (34)ని బోల్తా కొట్టించాడు. ప్రస్తుతం క్రీజులో హామిల్టన్ (2 నాటౌట్), రకీమ్ కార్న్‌వాల్ (4 నాటౌట్) ఉండగా.. భారత్ కంటే ఇంకా 329 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ వెనకబడి ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories