India vs South Africa: మయాంక్ అగర్వాల్ అద్భుత సెంచరీ

K V D Varma
Updated on: 10 Oct 2019 5:35 PM IST
India vs South Africa: మయాంక్ అగర్వాల్ అద్భుత సెంచరీ
X

దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ శతకంతో చెలరేగాడు. 183 బంతుల్లోనే 16 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన మయాంక్ అగర్వాల్ 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. విశాఖపట్నం వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌లోనూ మయాంక్ డబుల్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. తొలి టెస్టు హీరో రోహిత్‌ శర్మ (14) తక్కువ స్కోరుకే అవుటవగా, వన్‌డౌన్‌లో వచ్చిన పుజారా (58) అర్ధసెంచరీ చేసి పెవిలియన్‌కు చేరాడు.

అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ సమయోచితంగా ఆడుతూ సెంచరీ (108) చేసిన కొద్దిసేపటికే స్లిప్‌లో దొరికిపోయాడు. ప్రస్తుతం కోహ్లీ, రహానే క్రీజులో ఉన్నారు. 64 ఓవర్లకుగాను భారత్‌ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 199 పరుగులుగా ఉంది. కాగా, మూడు వికెట్లూ సౌతాఫ్రికా పేసర్‌ కగిసో రబడ తీయడం విశేషం.



K V D Varma

K V D Varma

Next Story