వెస్టిండీస్ తో రెండో వన్డే: రెండో వికెట్ కోల్పోయిన ఇండియా.. రోహిత్ శర్మ అవుట్!

వెస్టిండీస్ తో రెండో వన్డే: రెండో వికెట్ కోల్పోయిన ఇండియా.. రోహిత్ శర్మ అవుట్!
x
Highlights

టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పంత్ క్రీజులోకి వచ్చాడు.

టీమిండియా వెస్టిండీస్ టూర్ లో భాగంగా జరుగుతున్న వన్డే సిరీస్ లో రెండో వన్డే ఈరోజు జరుగుతోంది. టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. మొదటి వన్డే వర్షార్పణం అయిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలో నిలవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.

భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. రోస్టన్‌ చేజ్‌ బౌలింగ్‌లో రోహిత్‌ (18) షాట్‌కు యత్నించి పూరన్‌ చేతికి చిక్కాడు. క్రీజులోకి పంత్‌ వచ్చాడు. ప్రతి ఓవర్ లోనూ ఓ బౌండరీ బాదుతూ పంత్ దూకుడుగా ఆడుతున్నాడు. మరోవైపు కెప్టెన్ కోహ్లీ నిలకడగా ఆడుతున్నాడు. మొత్తమ్మీద 20 ఓవర్లకు భారత్ 94/2 పరుగుల స్కోరు సాధించింది. కోహ్లీ 53 పరుగులతోనూ, పంత్ 17 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories