logo

తిరుమల క్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 16 గంటలు

తిరుమల క్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 16 గంటలు
Highlights

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది

(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.... ఇవాళ గురువారం, మూలవిరాట్టుకు నిత్య కైంకర్యాలు నిర్వహించిన అనంతరం.. ఘంటా మండపంలో పెద్ద వెండిపీటపై ప్రత్యేకంగా తయారుచేసిన పులిహోరను రాసులుగా పోసి శ్రీవారికి నివేదించే తిరుపావై అనే విశేషమైన వారపు సేవను అర్చకులు నిర్వహించారు.

ఇక రద్దీ దృష్ట్యా సర్వదర్శనానికి వెళ్లే భక్తులకి శ్రీవారిని దర్శించుకోవటానికి 16 గంటలు, ప్రత్యేకప్రవేశ దర్శనానికి వెళ్లే భక్తులు 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులు వెళ్లే దివ్యదర్శనం, ఆథార్ కార్డు నమోదుతో టైంస్లాట్ సర్వదర్శనం టోకన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది... నిన్నటి రోజు బుధవారం 72,554 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు, వారు సమర్పించిన కానుకలతో శ్రీవారికి రూ 2.85 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది.27,877 మంది భక్తులు తలనీలాలు సమర్పించి శ్రీవారికి‌ మ్రొక్కులు చెల్లించుకున్నారు.


లైవ్ టీవి


Share it
Top