తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, వెంకన్న దర్శనానికి 12 గంటల సమయం

ఇవాళ బుధవారం, మూలవిరాట్టుకు నిత్య కైంకర్యాలు నిర్వహించిన అనంతరం..ఘంటా మండపంలో స్వామివారి ప్రతిరూపమైన భోగశ్రీనివాస ఉత్సవమూర్తికి సహస్ర కళశాభిషేకం అనే విశేషమైన వారపు సేవను అర్చకులు నిర్వహించారు.

K V D Varma
Updated on: 30 Oct 2019 10:53 AM IST
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, వెంకన్న దర్శనానికి 12 గంటల సమయం
X

(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

ఇవాళ బుధవారం, మూలవిరాట్టుకు నిత్య కైంకర్యాలు నిర్వహించిన అనంతరం..ఘంటా మండపంలో స్వామివారి ప్రతిరూపమైన భోగశ్రీనివాస ఉత్సవమూర్తికి సహస్ర కళశాభిషేకం అనే విశేషమైన వారపు సేవను అర్చకులు నిర్వహించారు...

ఇక రద్దీ దృష్ట్యా మూలవిరాట్టును దర్శించుకోవడానికి సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు 12 గంటలు, ప్రత్యేకప్రవేశ దర్శనానికి వెళ్లే భక్తులకు 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించే దివ్యదర్శనం, ఆథార్ కార్డు నమోదు తో కేటాయించే టైంస్లాట్ సర్వదర్శనం టోకన్లు కలిగిన భక్తులకు 4 గంటల సమయం పడుతొంది.... నిన్నటి రోజు మంగళవారం 78,885 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు, వారు సమర్పించిన కానుకలతో శ్రీవారికి రూ 3.77 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది, 25,652 మంది భక్తులు తలనీలాలు సమర్పించి శ్రీవారికి మ్రొక్కులు చెల్లించారు.

K V D Varma

K V D Varma

Next Story