Live Updates: Vinayaka Chathurdhi 2019: మీ ప్రియమైన వారి కోసం శుభాకాంక్షల సందేశాలు

శుభాకాంక్షల గీతిక.. ప్రియమైన వారికి పంపించడంలో ఉండే ఆనందం వేరు. దానికోసం మంచి మాటలు కావాలని అక్కడా ఇక్కడా వెదుకుతారు. అందుకే మీకోసం నాలుగు మంచి మాటలతో ఉన్న కొన్ని శుభాకాంక్షల సందేశాలను ఇక్కడ అందిస్తున్నాం. వాటిలో మీకు నచ్చిన వాటిని వినాయకచవితి సందర్భంగా మీ ప్రియమైన వారితో పంచుకోండి.

K V D Varma
Updated on: 2 Sept 2019 12:37 PM IST
Live Updates: Vinayaka Chathurdhi 2019: మీ ప్రియమైన వారి కోసం శుభాకాంక్షల సందేశాలు
X

వినాయకచవితి సందర్భంగా మన ప్రియమైన వారికి శుభాకాంక్షల సందేశాలు పంపిద్దాం.. మీకోసం కొన్ని చక్కని సందేశాలని గుచ్చంగా చేసి ఓకే దగ్గర అందిస్తున్నాం.. వీటిని మీ ప్రియమైన వారితో పంచుకోండి.


'మీకూ, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.. ఆ విఘ్నాదిపతి మీకు క్షేమ, స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని, సుఖసంతోషాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..

---

'వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా' అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

---

'గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు...'

----

'గజాననం భూత ఘనాధి సేవితం, కపిస్త ఝంబూఫాల శార భక్షితం.. ఉమాసుతం శోక వినాశకరనం నమామి విఘ్నేశ్వర పాద పంకజం' మీకు మీ కుటుంబసభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు

---

'ఓం గణానాంత్వా గణపతి గం హవామహే

ప్రియాణాంత్వా ప్రియపతి గం హవామహే

నిధీనాంత్వా నిధిపతి గం హవామహేవసే మమ

ఆ హమజాతి గర్భధమా త్వాం జాసి గర్భధం

ఓం గం గణపతయే నమః

మీకూ, మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు..'

----

'మూషికవాహన మోదకహస్త

చామరకర్ణ విలంబిత సూత్ర;

వామనరూప మహేశ్వరపుత్ర

విఘ్న వినాయక పాద నమస్తే' ఆ స్వామి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ.. వినాయక చతుర్థి శుభాకాంక్షలు

----

'ఆ గణనాథుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ.. మీకివే మా వినాయక చవితి శుభాకాంక్షలు..'

----

'విజయ గణపతి అనుగ్రహంతో మీకు, మీ కుటుంబానికి సదా,

సర్వదా అభయ, విజయ, లాభ, శుభాలు చేకూరాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు..'

---

'గజాననం భూతగణాదిసేవితం

కపిత్త జంబూఫల సారభక్షితం|

ఉమాసుతం శోకవినాశ కారణం

నమామి విఘ్నేశ్వర పాద పంకజం'

---

telugu.com నుంచి మీకోసం కొన్ని శుభాకాంక్షల ఇమేజీలు








K V D Varma

K V D Varma

Next Story