తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం : 4 గంటల్లోనే శ్రీవారి దర్శనం

ఇవాళ మంగళవారం, నిత్య కైంకర్యాలు నిర్వహించిన అనంతరం మూలవిరాట్టు పాదాలను బంగారు పుష్పాలతో అర్చించే అష్టదళపాదపద్మారాధన అనే ప్రత్యేక వారపు సేవను అర్చకులు నిర్వహించారు.

K V D Varma
Updated on: 5 Nov 2019 9:39 AM IST
TIRUMALA BALAJI
X
TIRUMALA BALAJI

తిరుమల, శ్యామ్.కె.నాయుడు

ఇవాళ మంగళవారం, నిత్య కైంకర్యాలు నిర్వహించిన అనంతరం మూలవిరాట్టు పాదాలను బంగారు పుష్పాలతో అర్చించే అష్టదళపాదపద్మారాధన అనే ప్రత్యేక వారపు సేవను అర్చకులు నిర్వహించారు.

ఇక దర్శన విషయాలకొస్తే సర్వదర్శనానికి వెళ్లే భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి 4 గంటల సమయం పడుతోంది, ప్రత్యేకప్రవేశ దర్శనానికి వెళ్లే భక్తులకు గంటన్నర, కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించే దివ్యదర్శనం, ఆథార్ కార్డు నమోదు తో కేటాయించే టైంస్లాట్ సర్వదర్శనం టోకన్లు కలిగిన భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. నిన్నటి రోజు సోమవారం 66,149 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు, భక్తులు సమర్పించిన కానుకలతో శ్రీవారికి రూ 2.83 కోట్లు హుండీ ఆదాయం సమకూరింది.

K V D Varma

K V D Varma

Next Story