Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 11 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 11 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 11 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | నవమి (రా.11-12 వరకు) తదుపరి దశమి | మృగశిర (ఉ.11-55 వరకు) తదుపరి ఆర్ద్ర | అమృత ఘడియలు (రా.2-20 నుంచి 4-08 వరకు) | వర్జ్యం (రా.8-39 నుంచి 10-19 వరకు) | దుర్ముహూర్తం (ఉ.8-16 నుంచి 9-05 వరకు తిరిగి మ.12-21 నుంచి 1-10 వరకు) | రాహుకాలం (ఉ.10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-04

ఈరోజు రాశి ఫలాలు

మేషం: కొత్త పనులు ప్రారంభిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దూరప్రయాణాలు.ఆలయ దర్శనాలు. ధనలబ్ధి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. విందువినోదాలు.

వృషభం: ఆర్థికపరమైన ఇబ్బందులు. పనుల్లో తొందరపాటు. బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

మిథునం: కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగుల యత్నాలు కొంత మందగిస్తాయి. దైవదర్శనాలు.

కర్కాటకం: నూతన ఉద్యోగయోగం. ముఖ్య∙నిర్ణయాలు. వృత్తి,వ్యాపారాలు ఆశాజనకంగాఉంటాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. శుభకార్యాల రీత్యా ఖర్చులు. విద్యార్థులకు శుభవార్తలు.

సింహం: పనులు విజయవంతమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ధన, వస్తులాభాలు. బాకీలు వసూలవుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కన్య: ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది.

తుల: ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవరోధాలు. మిత్రులతో విభేదాలు.ఆరోగ్యసమస్యలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం.

వృశ్చికం: ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.వృత్తి,వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. కళాకారులకు సత్కారాలు.

ధనుస్సు: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు.బంధువులతో తగాదాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి.

కుంభం: అనుకోని ధనవ్యయం. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఆలయ దర్శనాలు. ఆరోగ్యసమస్యలు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు.

మీనం: ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు. కుటుంబసమస్యలు తీరతాయి. నిరుద్యోగులు ఉద్యోగాలు దక్కించుకుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories