Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 07 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 07 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 07 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | పంచమి ( సా. 6-11వరకు) తదుపరి షష్ఠి | భరణి నక్షత్రం పూర్తిగా | అమృత ఘడియలు (రా. 12-58 నుంచి 2-44 వరకు) | వర్జ్యం (మ.2-21 నుంచి 4-07 వరకు) | దుర్ముహూర్తం (మ.12-22 నుంచి 1-11 వరకు తిరిగి మ.2-50 నుంచి 3-39 వరకు) | రాహుకాలం (ఉ. 7-30 నుంచి 9-00 వరకు) | సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-07

ఈరోజు రాశి ఫలాలు

మేషం: పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కాంట్రాక్టులు చేజారతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

వృషభం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

మిథునం: ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

కర్కాటకం: ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. స్థిరాస్తి వృద్ధి. పనులు విజయవంతంగా సాగుతాయి. ఉద్యోగయత్నాలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.

సింహం: సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కన్య: ఆర్థిక పరిస్థితి గందరగోళం. దూరప్రయాణాలు. అనుకోని ఖర్చులు. బంధువులతో స్వల్ప విభేదాలు. శ్రమధిక్యం. నిరుద్యోగులకు నిరాశ. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.

తుల: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. పనుల్లో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు రాగలవు.

వృశ్చికం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

ధనుస్సు: విచిత్ర సంఘటనలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

మకరం: సన్నిహితుల నుంచి సమస్యలు. ధనవ్యయం. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులలో స్వల్ప అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

కుంభం: వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

మీనం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories