Daily Horoscope: ఈరోజు మీరోజు! ఆగస్ట్ 05 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! ఆగస్ట్ 05 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం, 05ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం విదియ(రాత్రి 9-34 వరకు) తదుపరి తదియ; ధనిష్ఠ నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి శతభిష నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 5-04 నుంచి 6-47 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 11-40 నుంచి 12-31 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు రాశి ఫలాలు

మేషం: మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వివాదాలు పరిష్కారం. నూతన ఉద్యోగలాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృషభం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆధ్యాత్మిక చింతన. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో మార్పులు.

మిథునం: మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పకపోవచ్చు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో పనిభారం.

కర్కాటకం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. వాహనాలు, భూములు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు.

సింహం: దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్య సూచనలు. బంధువుల కలయిక. విచిత్ర సంఘటనలు. నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

కన్య: ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. భూములు, ఇళ్ల కొనుగోలు. విద్యావకాశాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ప్రగతి.

తుల: మిత్రులు, బంధువులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

వృశ్చికం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. సోదరులతో సఖ్యత. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

ధనుస్సు: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. పనులలో విజయం. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు.

మకరం: వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

కుంభం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులు మరింత శ్రమపడాలి. ప్రయాణాలలో మార్పులు. స్వల్ప అనారోగ్యం. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆస్తి వివాదాల పరిష్కారం. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకోని పదోన్నతులు.

Show Full Article
Print Article
Next Story
More Stories