Daily Horoscope: ఈరోజు మీరోజు! ఆగస్టు 04 పంచాంగం, రాశిఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! ఆగస్టు 04 పంచాంగం, రాశిఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం, 04 ఆగస్టు, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం పాడ్యమి (రాత్రి 8-52 వరకు) తదుపరి విదియ, శ్రవణ నక్షత్రం (ఉ. 8-15 వరకు) తర్వాత ధనిష్ఠ నక్షత్రం.. అమృత ఘడియలు ( రాత్రి 10-29 నుంచి 12-09 వరకు), వర్జ్యం (మ. 12-26 నుంచి 2-06 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-15 నుంచి 9-06 వరకు తిరిగి రాత్రి 10-58 నుంచి 11-43 వరకు) రాహుకాలం (మ. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం ఉ.5-42 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు రాశి ఫలాలు

మేషం : పనులు నిరుత్సాహపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. ఆర్థిక విషయాలు అసంతృప్తి కలిగిస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

వృషభం : ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు అసంతృప్తి కలిగిస్తాయి. ఉద్యోగస్తులు బాధ్యతలతో తలమునకలవుతారు.

మిథునం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

కర్కాటకం : మిత్రులతో వివాదాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

సింహం : సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కన్య : రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో సమస్యలు.

తుల : సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభవార్తలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత వృద్ధి. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.

వృశ్చికం : ప్రముఖులతో పరిచయాలు. ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు : ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

మకరం : శ్రమ మరింత పెరుగుతుంది. ముఖ్య వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. దూరప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప ఆటంకాలు.

కుంభం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో ఆదరణ. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మీనం : పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. ధనలబ్ధి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలం.

Show Full Article
Print Article
Next Story
More Stories