తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది ఇవాళ అదివారం, స్వామివారి మూలవిరాట్టుకు నిత్యసేవలు మినహా ప్రత్యేకసేవలేవి ఉండవు.

K V D Varma
Updated on: 4 Nov 2019 11:42 AM IST
tirumala balaji
X
tirumala balaji

తిరుమల, శ్యామ్.కె.నాయుడు

ఇవాళ సోమవారం మూలవిరాట్టుకు నిత్య కైంకర్యాల అనంతరం శ్రీదేవి,భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవమూర్తులకు కల్యాణోత్సవ మండపంలో విశేషపూజ అనే ప్రత్యేక వారపు సేవను అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఇక గత నాలుగురోజులుగా ఉన్న భక్తుల రద్దీ ఇవాళ సాధారణ స్థాయికి చేరుకుంది. సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునే భక్తులకు 8 గంటల సమయం పడుతుంది, ప్రత్యేకప్రవేశ దర్శనానికి వెళ్లే భక్తులకు 2 గంటల సమయం, కాలినడక వచ్చే భక్తులకు కేటాయించే దివ్యదర్శనం టోకన్లు, ఆథార్ కార్డ్ నమోదుతో పొందే టైంస్లాట్ సర్వదర్శనం టోకన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. నిన్న అదివారం 83,657 మంది భక్తులు శ్రీవారి దర్శనభాగ్యం పొందారు, భక్తులు సమర్పించిన కానుకలతో శ్రీవారికి రూ 3.39 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది.. 22,483 మంది భక్తులు తలనీలాలు సమర్పించి స్వామివారికి మ్రొక్కులు చెల్లించారు.

K V D Varma

K V D Varma

Next Story