తిరుమలలో భక్తుల రద్దీ సామాన్యం.. నాలుగు గంటల్లో స్వామి వారి దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ సామాన్యం.. నాలుగు గంటల్లో స్వామి వారి దర్శనం
x
Highlights

♦ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ♦ 4 గంటలు వేచివుంటే వెంకన్న దర్శనభాగ్యం

(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

ఇవాళ అక్టోబర్గు 24, గురువారం, మూలవిరాట్టుకు నిత్య కైంకర్యాలు నిర్వహించిన అనంతరం..గరుడాళ్వార్ మండపంలో పెద్ద వెండిపీటపై పులోహోరను రాసులుగా పోసి శ్రీవారి నివేదించే తిరుపావై అనే విశేషమైన వారపు సేవను అర్చకులు నిర్వహించారు...

ఇక రద్దీ తక్కువగా ఉండడంతో సర్వదర్శనానికి వెళ్లే భక్తులు 4 గంటల్లోనే శ్రీవారిని దర్శించుకుంటున్నారు, ప్రత్యేకప్రవేశ దర్శనానికి వెళ్లే భక్తులు గంటన్నర, కాలినడకన వచ్చే భక్తులు వెళ్లే దివ్యదర్శనం, ఆథార్ కార్డు నమోదుతో టైంస్లాట్ సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు 2 గంటల సమయంలోనే స్వామివారి దర్శనభాగ్యం పొందుతున్నారు.

నిన్నటి రోజు బుధవారం 60,449 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు, వారు సమర్పించిన కానుకలతో శ్రీవారికి రూ 3.80 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది....23,705 మంది భక్తులు తలనీలాలు సమర్పించి శ్రీవారికి‌ మ్రొక్కులు చెల్లించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories