తెలుగు టైటాన్స్ అదరహో.. ఉత్కంఠ పోరులో విజయం

తెలుగు టైటాన్స్ అదరహో.. ఉత్కంఠ పోరులో విజయం
x
Highlights

ప్రొ కబడ్డి లీడ్ ఏడో సీజన్‌లో భాగంగా నిన్న(సోమవారం) బెంగళూరు వేదికగా తమిళ్ తలైవాస్‌ వార్సెస్ తెలుగు టైటాన్స్ హోరాహోరి పోరుసాగింది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 35-30 తేడాతో విజయం సాధించింది.

ప్రొ కబడ్డి లీడ్ ఏడో సీజన్‌లో భాగంగా నిన్న(సోమవారం) బెంగళూరు వేదికగా తమిళ్ తలైవాస్‌ వార్సెస్ తెలుగు టైటాన్స్ హోరాహోరి పోరుసాగింది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 35-30 తేడాతో విజయం సాధించింది. మొన్నటి వరకు గెలుస్తూ ఓడుతూ వస్తున్న టైటాన్స్ నిన్న మ్యాచ్‌లో పూంజుకుంది. టైటాన్స్ స్టార్ రైడర్ సిద్ధార్థ దేశాయ్ మ్యాచ్ హైలెట్ అనే చెప్పవచ్చు. మొత్తం 16 సార్లు కూతకి వెళ్లిన సిద్ధార్థ దేశాయ్ 9 పాయింట్లు సాధించాడు. ఇక సిద్ధార్థకు తోడుగా విశాల్ భరద్వాజ్ చేయిపడడంతో విశాల్ కూడా 8 సార్లు ట్యాకిల్‌కి ప్రయత్నించిన 6 పాయింట్లు సాధించాడు. దీంతో తమిళ్ తలైవాస్‌పై తెలుగు టైటాన్స్ విజయకేతనం ఎగురవేసింది. దీంతో 12వ మ్యాచ్ ఆడిన టైటాన్స్ నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి చేరుకోగా.. 13వ మ్యాచ్ ఆడి 8వ ఓటమితో తమిళ్ తలైవాస్ 10వ స్థానానికి పడిపోయింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories