నల్ల రంగు జెర్సీ.. టైటాన్స్‌ బోణీ

నల్ల రంగు జెర్సీ.. టైటాన్స్‌ బోణీ
x
Highlights

ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుస ఓటమిలతో పాయింట్ల పట్టికలో అట్టడుగుకు వెళ్లిన తెలుగు టైటాన్స్ మొత్తానికి బోణీ కొట్టింది. ఐదు పరాజయాలు, ఓ టై తర్వాత సమిష్టి కృషితో విజయం సాధించింది.

ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుస ఓటమిలతో పాయింట్ల పట్టికలో అట్టడుగుకు వెళ్లిన తెలుగు టైటాన్స్ మొత్తానికి బోణీ కొట్టింది. ఐదు పరాజయాలు, ఓ టై తర్వాత సమిష్టి కృషితో విజయం సాధించింది. ఆదివారం మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 30-24తో ఆతిథ్య గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌పై నెగ్గింది. మారిన జెర్సీ రంగు తెలుగు టైటాన్స్‌ జట్టుకు అదృష్టాన్ని తీసుకొచ్చింది. డిఫెండర్‌ విశాల్‌ 7 టాకిలింగ్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. గుజరాత్‌ తరఫున పర్వేష్‌ భైంస్వాల్‌ 7 టాకిలింగ్‌ పాయింట్లతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రైడింగ్‌లో గుజరాత్‌ పైచేయి సాధించినా టైటాన్స్‌ డిఫెన్స్‌లో దూమ్మురేపింది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 30–33తో హరియాణా స్టీలర్స్‌ చేతిలో ఓడింది. నేటి మ్యాచ్‌ల్లో బెంగాల్‌ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్‌; యూపీ యోధతో బెంగళూరు బుల్స్‌ తలపడతాయి. బెంగాల్‌ x తెలుగు టైటాన్స్‌ 7.30గం, యూపీ x బెంగళూరు 8.30గం మ్యాచ్ జరుగుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories