వేగం పెంచిన ఒత్తిడి

వేగం పెంచిన ఒత్తిడి
x
Highlights

ఒత్తిడి గురించి భయపడాల్సిన విషయం ఏంటో మీకు తెలుసా? అది మన చుట్టూ ఎంత పెరుగుతే, మనలో రోగ నిరోధక శక్తి అంత తగ్గుతుందట. ముఖ్యంగా మన రోజు వారి జీవితంలో...

ఒత్తిడి గురించి భయపడాల్సిన విషయం ఏంటో మీకు తెలుసా? అది మన చుట్టూ ఎంత పెరుగుతే, మనలో రోగ నిరోధక శక్తి అంత తగ్గుతుందట. ముఖ్యంగా మన రోజు వారి జీవితంలో పెరుగుతున్న వేగం, మారుతున్న ఆహార అలవాట్లు, పెరుగుతున్న అధిక శారీరక భరువు చాలామందిలో ఒత్తిడిని పెంచుతున్నాయి, అదే కాక ఆర్ధిక విషయాలలో వచ్చే మార్పులు, ఆరోగ్య విషయాల్లో వచ్చే మార్పులు, మనవ సంబంధాల్లో వచ్చే మార్పులు కూడా ఒత్తిడిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఎన్నో పరిశోదనలు చెపుతున్నాయి. కాబట్టి ఈ ఒత్తిడిని తగ్గించుకోడానికి ప్రతి వ్యక్తి తనదైన శైలిలో ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన సమయం వచ్చినది. అందుకు మీరు యోగ లేదా మెడిటేషన్ ని ఎంచుకోవచ్చు. మీకు నచ్చిన సంగీతాన్ని రోజు కొంత సమయం వినవచ్చు లేదా మీకు నచ్చిన వ్యక్తితో, మీకు నమ్మకమైన వ్యక్తి తో మనసు విప్పి కొంత సమయం మాటలాడటం చేయవచ్చు. దీని వలన కూడా వత్తిడి తగ్గుతుంది. కాబట్టి ఈ రోజే మీ ఒత్తిడిని తగ్గించుకోడానికి మీకు నచ్చిన ఒక చర్య మొదలెట్టండి. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories