West Bengal Election 2021: పశ్చిమ బెంగాల్లో కొనసాగుతోన్న చివరి దశ పోలింగ్

West Bengal Election 2021: నేడు ఎనిమిదవ విడత లో 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది.

Kranthi
Updated on: 29 April 2021 9:23 AM IST
West Bengal Assembly Election Phase-8 Voting Today
X

West Bengal Election 2021:(Twitter)

West Bengal Election 2021: పశ్చిమ బెంగాల్‌లో చివరి దశ ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. నేడు 35 సీట్లకు ఎలెక్షన్ జరుగుతుండగా.. 283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 84 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పటి వరకు, టిఎంసి, బిజెపిల మధ్య ప్రత్యక్ష పోటీ కనిపించింది, కాని చివరి దశలో టిఎంసి-కాంగ్రెస్, వామపక్ష కూటమి మధ్య గట్టి పోరాటం జరుగుతుంది.

ఈ దశలో, అన్ని పార్టీలు ముస్లిం ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

కరోనా ఉధృతి నేపధ్యంలో ఓటర్లు వైరస్ బారిన పడకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాచనీయ సంఘటనలు తలెత్తకుండా పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో 753 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఈ దశ పోలింగ్ లో 83 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది.

Kranthi

Kranthi

Next Story