ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత

Uttar Pradesh: కాంగ్రెస్ తిరుగుబాటు నేతల బృందం జీ-23లో ఉన్న జితిన్

Sandeep Eggoju
Updated on: 9 Jun 2021 3:04 PM IST
Uttar Pradesh Congress Senior Leader Joined in BJP
X

జితిన్ ప్రసాద (ఫైల్ ఇమేజ్)

Uttar Pradesh: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేత జితిన్ ప్రసాద కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో బీజేపీలో చేరారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో జితిన్ చేరికకు ప్రాధాన్యత పెరిగింది. యూపీఏ ప్రభుత్వంలో జితిన్ ప్రసాద మంత్రిగా పని చేశారు. జితిన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేతల బృందంలో జీ-23లో ఉన్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story