భారత్ లో కరోనా దూకుడు.. ఒక్కరోజే 99 కేసులు!

భారత్ లో కరోనా దూకుడు.. ఒక్కరోజే 99 కేసులు!
x
Representational Image
Highlights

ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా వైరస్ భారత్ లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. మెల్లగా ప్రారంభమైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా క్రమేపీ వేగంగా పెరుగుతూ...

ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా వైరస్ భారత్ లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. మెల్లగా ప్రారంభమైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా క్రమేపీ వేగంగా పెరుగుతూ వస్తోంది. నిన్న (సోమవారం, మర్చి 23) ఒక్కరోజే దేశవ్యాప్తంగా 99 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి మొత్తమ్మీద ఇండియాలో వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 498 కి చేరింది. గత మూడురోజుల్ల్లోనే కొత్తగా 246 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.

ఇక మొత్తమ్మీద దేశంలో 478 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో 40 విదేశీయులు. కాగా, ఇప్పటివరకూ కరోనా కారణంగా మొత్తం 9 మంది చనిపోయారు. తాజాగా సోమవారం కోల్ కత్తా లో ఒకరు, హిమాచల్ ప్రదేశ్ లో ఒకరు మరణించారు.

రాష్ట్రాల వారీగా సోమవారం నమోదైన కరోనా కేసుల వివరాలు..

కేరళలో 28, మహారాష్ట్రలో 23, గుజరాత్ లో 12 కేసులు నమోదు అయ్యాయి. మొత్తమ్మీద 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. కాగా, హిమాచల్ ప్రదేశ్ లో ముగ్గురికి కరోనా సోకగా, ఒకరు చనిపోయారు. అదేవిధంగా తెలంగాణలో కేసుల సంఖ్య 33 కు చేరింది.

ఇప్పటివరకూ 15 మంది కరోనా కోరల నుంచి విముక్తులయ్యారు. కరోనా నుంచి బయట పడిన వారిలో హైదరాబాద్, నెల్లూరు కు చెందిన వారున్నారు.

ఇంటికే పరిమితం కావడం, సామాజిక దూరం పాటించడం వల్ల కరోనా కేసుల సంఖ్యను 62 శాతం వరకు తగ్గించొచ్చని.. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటితో పోలిస్తే కేసుల సంఖ్యను 89 శాతం వరకు తగ్గించగలమని ఐసీఎంఆర్ తెలిపింది. కరోనా లక్షణాలు కనిపించని వారిని కనీసం 75 శాతం మందిని గుర్తించగలిగితే కరోనా వేగంగా వ్యాప్తి చేయకుండా అడ్డుకోగలమని తెలిపింది. కరోనా లక్షణాలు కనిపించని 90 శాతం మందిని గుర్తించగలిగితే.. ఈ వ్యాధి సగటు సమయాన్ని 20 రోజులకు వాయిదా వేయగలమని ఐసీఎంఆర్ అంచనా వేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories