భారత ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు!

K V D Varma
Updated on: 5 Aug 2019 12:52 PM IST
భారత ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు!
X

భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈరోజు అత్యంత చీకటి దినం అంటూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేయడాన్ని ఆమె ఖండించారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు.'భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈరోజు అత్యంత చీకటి దినం. 1947 నాటి సంప్రదాయాన్ని మంటగలిపారు. భారత ప్రభుత్వం ఆర్టికల్‌ 370 రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం. కశ్మీర్‌కు ఇచ్చిన మాట తప్పారు. ఆర్టికల్‌ 370 రద్దు ఏకపక్ష నిర్ణయం' అని ట్వీట్‌ చేశారు.



K V D Varma

K V D Varma

Next Story