సోషల్ మీడియాలోనూ తిరుగులేని నేత సుష్మా!

సోషల్ మీడియాలోనూ తిరుగులేని నేత సుష్మా!
x
Highlights

సమాచార విప్లవాన్ని అందిపుచ్చుకోవడంలో సుష్మా స్వరాజ్ ముందు వరుసలో నిలిచారు. ముఖ్యంగా ట్విట్టర్ ద్వారా ఆమె ప్రజలకు మరింత చేరువయ్యారు. ఈ తరానికి కూడా...

సమాచార విప్లవాన్ని అందిపుచ్చుకోవడంలో సుష్మా స్వరాజ్ ముందు వరుసలో నిలిచారు. ముఖ్యంగా ట్విట్టర్ ద్వారా ఆమె ప్రజలకు మరింత చేరువయ్యారు. ఈ తరానికి కూడా సుష్మా స్వరాజ్ తన ట్విట్టర్ ద్వారా ఎంతో దగ్గరయ్యారు. 2010లో ఆమె ట్విట్టర్ ఎకౌంట్ ప్రారంభించారు. 2014లో ఆమె విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టి నప్పటినుంచి ట్విట్టర్ వేదికగా ఆమె ఎన్నో విషయాలను ప్రజలతో పంచుకున్నారు. అంతే కాకుండా, ట్విట్టర్ ద్వారా తన ముందుకు వచ్చిన అన్ని సమస్యల్నీ ఆమె పరిష్కరించే వారు. వాటి పై వెంటనే స్పందించేవారు. తన శాఖకు సంబంధించిన విషయాలు అయితే వెంటనే సంబంధిత అధికారుల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా చూసేవారు. తన పరిధిలో లేని అంశాలను ఆయా శాఖల బాధ్యుల వద్దకు చేర్చి తన వంతు ప్రయత్నం చేసేవారు.

ఏ సమయంలోనైనా సుష్మా స్వరాజ్ తన ట్విట్టర్ ద్వారా స్పందించే వారు. అందుకే ప్రముఖ అంతర్జాతీయ పత్రిక వాహింగ్టన్ పోస్ట్ ఆమెను 'సూపర్ మామ్' అని ట్యాగ్ తగిలించింది. సుష్మా స్వరాజ్ ను ట్విట్టర్ లో 1.3 కోట్ల మంది అనుసరిస్తున్నారు.

సుష్మ స్వరాజ్ చేసిన చివరి ఫోటో ట్వీట్ ఇదే.. దీని తరువాత ఆమె ఫోటోలు ట్వీట్ చేయలేదు...


Show Full Article
Print Article
More On
Next Story
More Stories