Sonu Sood: రాజకీయాల్లోకి సోనూసూద్‌..!

Sonu Sood: hmtv ఇంటర్వ్యూలో మనసులో మాట బయటపెట్టిన సోనూసూద్‌ * ప్రజాసేవకు రాజకీయాలు మంచి వేదిక-సోనూసూద్‌

Sandeep Eggoju
Published on: 9 Jun 2021 6:08 PM IST
Sonu Sood Reavels his Opinion About Politics
X

నటుడు సోను సూద్ (ఫైల్ ఇమేజ్)

Sonu Sood: ప్రజాసేవతో రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్.. hmtv ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ ఎంట్రీపై తన మనసులో మాటను బయటపెట్టారు. ప్రజాసేవకు రాజకీయాలు మంచి వేదిక అన్నారు. ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని, కానీ ఆరేడేళ్ల తర్వాత రాజకీయాల్లోకి వస్తానేమో అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాను చేస్తున్న సేవపై సంతృప్తిగా ఉన్నానని సోనూసూద్‌ తెలిపారు. ప్రజాసేవకు రాజకీయాలు మంచి వేదికైనా.... ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం మాత్రం లేదన్నారు. రాజకీయాల్లోకి రావడానికి తానింకా మానసికంగా సిద్ధంకాలేదదన్నారు. గతంలో పలు పార్టీలు తనను ఆహ్వానించాయని, కానీ అప్పుడు ఇంట్రస్ట్ చూపలేదని సోనూసూద్‌ తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story