Sonu Sood: బొగ్గుతో సోనూసూద్‌ బొమ్మ గీసిన లాల్ ప్రసాద్

Sonu Sood: సోషల్ మీడియాలో వైరల్ అయిన సోనూసూద్ చిత్రం * ఫోటోను సోనూసూద్‌కు ట్యాగ్ చేసిన ఎంపీ రామ్మోహన్

Sandeep Eggoju
Published on: 16 May 2021 1:02 PM IST
Sonu Sood Coal Art by Lal Prasad
X

సోను సూద్ కాల్ ఆర్ట్ (ఫైల్ ఇమేజ్)

Sonu Sood: టాలీవుడ్‌లో అతడు పెద్ద హీరో కూడా కాదు.. అందరిలా ప్రతి సినిమాకు కోట్లకు కోట్లు తీసుకోడు.. అయినా సాయం చేసే విషయంలో మాత్రం ఓ అడుగు ముందే ఉంటాడు. కష్టం అంటే చాలు నేనున్నా అంటూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. అతడే భారత రియల్ హీరో సోనూసూద్. అలాంటి మానవతావాదికి శ్రీకాకుళం నగరానికి చెందిన లాల్‌ ప్రసాద్‌ అనే యువకుడు ఏదైనా బహుమతి ఇవ్వాలని భావించాడు. అనుకున్నదే తడవుగా అద్భుతాన్ని ఆవిష్కరించాడు.

రియల్ హీరోకి లాల్‌ ప్రసతాద్ మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. బొగ్గుతో సోనూసూద్‌ నిలువెత్తు బొమ్మను గీశాడు. రియల్ హీరోపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్‌ అవుతోంది. ఈ ఫోటోను ఎంపీ రామ్మోహన్ ట్వీట్ చేయడంతో రియల్ హీరో సోనూ కంటపడింది. అనంతరం సోనూసూద్ నుంచి సిక్కోలు వాసికి ఫోన్ వచ్చింది. కరోనా తగ్గిన వెంటనే డిన్నర్‌కు రావాలని ఆహ్వానం కూడా అందింది. ఊహించని ఫోన్ కాల్‌తో సిక్కోలు వాసి ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి.

సోనూసూద్ లాంటి రియల్ హీరో దృష్టిలో సిక్కోలు వాసి పడడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. రియల్ హీరో ఫోన్ చేయడంపై సిక్కోలు జిల్లా వాసులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు.. లాల్ ప్రసాద్ కూడా ఎప్పటికైనా రియల్ హీరో సోనూసూద్‌ను కలిసి తాను గీసిన చిత్రాన్ని బహూకరిస్తానని అంటున్నాడు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story