TOP 6 NEWS @ 6PM: SLBC Tunnel collapse: ఎస్ఎల్‌బీసీ సొరంగం వద్దకు సీఎం రేవంత్ రెడ్డి


1) ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్ బీసీ టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి...
1) ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి
ఎస్ఎల్ బీసీ టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతా కుమారితో కలిసి అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సొరంగంలో గత 9 రోజులుగా జరుగుతున్న రెస్క్కూ ఆపరేషన్ ఆయన పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్న అనేక బృందాల అధిపతులతో ఆయన మాట్లాడి సహాయ చర్యల పురోగతిని అడిగి తెలుసుకుంటున్నారు. సొరంగం తవ్వకంలో, కార్మికులను గుర్తించడంలో వారికి ఎదురవుతున్న సవాళ్లను కనుక్కుంటున్నారు.
2) Warangal Airport: మామునూరు ఎయిర్ పోర్ట్ ఆలస్యానికి కారణం ఏంటంటే...
Rammohan Naidu about Warangal airport: వరంగల్ ఎయిర్ పోర్ట్ స్వాతంత్య్రం రాక ముందే చాలా కీలకంగా పనిచేసిందని చరిత్ర చెబుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆ తరువాత కాలంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ కేంద్రంగా జరగడంతో వరంగల్ ఎయిర్ పోర్ట్ మూసేసే పరిస్థితి తలెత్తిందని గుర్తుచేశారు.
వరంగల్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు ఇంత ఆలస్యం అవడానికి గల కారణాలను ఆయన వివరించారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3) సీఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెండ్
AP CID former chief Sunil Kumar suspended: సీఐడి మాజీ చీఫ్, ఐపీఎస్ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజును వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వంలోని పెద్దల ఆదేశాల మేరకు సునీల్ కుమార్ ఆయన్ను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సునీల్ కుమార్ విచారణ ఎదుర్కుంటున్నారు. దీనికితోడు సునీల్ కుమార్ 2020-24 మధ్య కాలంలో పలు సందర్భాల్లో ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లి వచ్చినట్లు ప్రభుత్వం గుర్తించింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4) Motivational Real Story: ప్రింటర్ కొనడానికి వెళ్లి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను రిక్రూట్ చేసుకున్న సీఈఓ
CEO hires sales associate as Front End Engineer: అన్‌స్టాప్ సీఈఓ అంకిత్ అగర్వాల్ తనకు ఎదురైన ఒక వ్యక్తిగత అనుభవాన్ని లింక్డ్‌ఇన్ ద్వారా నెటిజెన్స్‌తో పంచుకున్నారు. ఆయన ఆ స్టోరీని షేర్ చేసుకున్న కొద్దిసేపటికే అది వైరల్ అయింది. ఎందుకంటే అందులో ఒక ఇన్‌స్పిరేషనల్ థీమ్ కూడా ఉంది. అంకిత్ అగర్వాల్ చెప్పిన ఆ రియల్ స్టోరీ ఏంటంటే...
అంకిత్ అగర్వాల్ ఢిల్లీలో ఒక ప్రింటర్ కొనడానికని రిలయన్స్ డిజిటల్‌కు వెళ్లారు. అక్కడ ప్రింటర్స్ గురించి తెలుసుకునే క్రమంలో సందీప్ కుమార్ అనే ఒక సేల్స్ ఎగ్జిక్యూటీవ్‌ని కలిశారు. సందీప్‌తో మాట్లాడుతున్న సమయంలోనే తెలిసింది ఏంటంటే... ఆయన అక్కడ కేవలం బతుకుదెరువు కోసమే ఈ ఉద్యోగం చేస్తున్నారు కానీ ఆయన అసలు లక్ష్యం వేరే ఉందని. తను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నట్లు సందీప్ చెప్పారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5) Viral Video: విమానానికి పక్షి ఢీకొని మంటలు... ఎమర్జెన్సీ ల్యాండింగ్ దృశ్యాలు వైరల్
Flight catches fire due to bird hit: ఫెడ్ఎక్స్ కార్గో విమానానికి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి ఢీకొని మంటలు అంటుకున్నాయి. అమెరికాలోని నెవార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదాన్ని వెంటనే పసిగట్టిన పైలట్ విమానాన్ని మళ్లీ ఎయిర్ పోర్టుకు తీసుకొచ్చి సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
బోయింగ్ 767-3S2F విమానం ఉదయం 8 గంటలకు టేకాఫ్ అయింది. కొన్ని నిమిషాల్లోనే పక్షి ఢీకొని కుడివైపు ఉన్న ఇంజన్లో మంటలు తలెత్తాయి. ఇంజన్లో మంటలు అంటుకోవడం గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోరుతూ నెవార్క్ లిబర్టీ ఎయిర్ పోర్టుకు సమాచారం అందించారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) Paytm: పేటీఎంకు ఈడీ నోటీసులు.. ఆందోళనలో కస్టమర్లు..!
Paytm: భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ పేమెంట్స్, ఫినాన్సియల్ సర్వీసెస్ కంపెనీ పేటీఎం, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం, 1999 (FEMA) ఉల్లంఘనకు పాల్పడినందుకు ఫిబ్రవరి 28, 2025న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నుండి షో కాజ్ నోటీసు (SCN) అందుకుంది. ఈ ఆరోపణలు పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL) కొనుగోలు చేసిన రెండు అనుబంధ సంస్థలు - లిటిల్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్ (LIPL), నియర్బీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (NIPL) లకు సంబంధించినవి. ఈ ఉల్లంఘనలు ప్రధానంగా 2015 - 2019 మధ్య లావాదేవీలకు సంబంధించినవి. ఇవి పేటీఎం ఈ కంపెనీలలో పెట్టుబడి పెట్టడానికి ముందు జరిగాయి. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



