Motivational Real Story: ప్రింటర్ కొనడానికి వెళ్లి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను రిక్రూట్ చేసుకున్న సీఈఓ


Motivational Real Story: ప్రింటర్ కొనడానికి వెళ్లి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను రిక్రూట్ చేసుకున్న సీఈఓ
Unstop CEO Ankit Aggarwal: "టాలెంట్ ఇక్కడ, అక్కడ అని కాదు... అంతటా ఉంది.
CEO hires sales associate as Front End Engineer: అన్‌స్టాప్ సీఈఓ అంకిత్ అగర్వాల్ తనకు ఎదురైన ఒక వ్యక్తిగత అనుభవాన్ని లింక్డ్‌ఇన్ ద్వారా నెటిజెన్స్‌తో పంచుకున్నారు. ఆయన ఆ స్టోరీని షేర్ చేసుకున్న కొద్దిసేపటికే అది వైరల్ అయింది. ఎందుకంటే అందులో ఒక ఇన్‌స్పిరేషనల్ థీమ్ కూడా ఉంది. అంకిత్ అగర్వాల్ చెప్పిన ఆ రియల్ స్టోరీ ఏంటంటే...
అంకిత్ అగర్వాల్ ఢిల్లీలో ఒక ప్రింటర్ కొనడానికని రిలయన్స్ డిజిటల్‌కు వెళ్లారు. అక్కడ ప్రింటర్స్ గురించి తెలుసుకునే క్రమంలో సందీప్ కుమార్ అనే ఒక సేల్స్ ఎగ్జిక్యూటీవ్‌ని కలిశారు. సందీప్‌తో మాట్లాడుతున్న సమయంలోనే తెలిసింది ఆయన అక్కడ కేవలం బతుకుదెరువు కోసమే ఈ ఉద్యోగం చేస్తున్నారు కానీ ఆయన అసలు లక్ష్యం వేరే ఉందని. తను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నట్లు సందీప్ చెప్పారు. ఫ్రండ్ ఎండ్ ఇంజనీర్‌గా జాబ్ చేసేందుకు ఆ కోర్స్ నేర్చుకుంటున్నట్లు తెలిపారు.
సందీప్ కుమార్ మాట తీరు, ఆయన ఆత్మ విశ్వాసం, తనను తను అప్‌గ్రేడ్ చేసుకుంటున్న తీరు అంకిత్ అగర్వాల్‌కు బాగా నచ్చాయి. వెంటనే సందీప్‌కు ఒక అవకాశం ఇచ్చారు. మీ స్కిల్స్‌ని టెస్ట్ చేసేందుకు ఒక యాప్ డెవలప్ చేసి చూపించాల్సిందిగా కోరారు. అది కేవలం అసైన్‌మెంట్ కోసమే అని చెప్పారు.
అంకిత్ ఇచ్చిన అసైన్‌మెంట్‌ను సందీప్ పూర్తి చేసి చూపించారు. ఫ్రండ్ ఎండ్ ఇంజనీర్‌గా తను పని చేయగలనని ప్రూవ్ చేసుకున్నారు. ఇంకేం... అంకిత్ అగర్వాల్ ఆయనకు తన అన్‌స్టాప్ కంపెనీలో ఆ జాబ్ ఇచ్చేశారు.
దీంతో అప్పటివరకు రిలయన్స్ డిజిటల్‌లో సేల్స్ అసోసియేట్‌గా పనిచేసిన సందీప్... ఆ తరువాతి నుండి అన్‌స్టాప్ కంపెనీలో ఫ్రండ్ ఎండ్ ఇంజనీర్ అయ్యారు.
వాస్తవానికి ఆ ఉద్యోగం కోసం ఎలాంటి రిక్రూట్మెంట్ జరగడం లేదు. ఆ ఉద్యోగం తనకు కావాలని సందీప్ అడగనూలేదు. కానీ టాలెంట్ ఎక్కడున్నా అవకాశం దాన్ని వెదుక్కుంటూ వస్తుందని ఈ రియల్ స్టోరీ ప్రూవ్ చేసింది.
అంకిత్ అగర్వాల్ కూడా తన లింక్డ్‌ఇన్ పోస్టులో ఇదే విషయం రాసుకొచ్చారు. "టాలెంట్ ఇక్కడ, అక్కడ అని కాదు... అంతటా ఉంది. ఎదుటివారితో మాట్లాడితే వారిలో ఉన్న టాలెంట్ ఏంటో తెలుస్తుంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.జీవితంలో పరిస్థితుల ప్రభావం వల్ల ఎప్పుడు, ఏ రంగంలో, ఏ చిన్న ఉద్యోగంలో పనిచేయాల్సి వచ్చినా... అక్కడే ఆగిపోకుండా కొత్త విషయాలు నేర్చుకుని ఇలా ముందడుగేయాలని ఈ స్టోరీ చెబుతోంది.
Also watch this interesting video - Countries with More Women Than Men: ఈ దేశాల్లో మగాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఎక్కువ
Also watch this Trending Story video - Posani,Vallabhaneni Arrest:వల్లభనేని వంశీ, పోసాని అరెస్ట్… రేపెవరు?
Also watch this video - Pune Bus Horror Case: 75 గంటల సెర్చ్ ఆపరేషన్... ఒక చిన్న క్లూతో దొరికిపోయిన గాడె

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



