Assembly Session Under Tree in Puducherry: హిస్టరీలో ఫస్ట్ టైం.. ఆరుబయట ఆసెంబ్లీ సమావేశాలు!

Assembly Session Under Tree in Puducherry:  హిస్టరీలో ఫస్ట్ టైం.. ఆరుబయట ఆసెంబ్లీ సమావేశాలు!
x
Puducherry MLA tests positive for Covid-19; assembly session to be held in open space
Highlights

Assembly Session Under Tree in Puducherry: కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి కరోనా సోకుతుంది.

Assembly Session Under Tree in Puducherry: కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి కరోనా సోకుతుంది. తాజాగా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని ఆల్‌ ఇండియా ఎన్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎన్‌.ఎస్‌.జె. జయబాల్‌ కరోనా బారిన పడ్డారు. అక్కడ కరోనా వైరస్ బారిన పడిన తొలి ఎమ్మెల్యే ఆయనే కావడం విశేషం.. ప్రస్తుతం ఆయనని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. దీనితో ప్రస్తుతం అక్కడ జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను అరబయయకు మార్చారు. ఇలా ఆరుబయట అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం..

పుదుచ్చేరి అసెంబ్లీలో ఈ నెల 20న బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఆ రోజుతో పాటు, మరుసటి రోజు సమావేశాల్లోనూ జయబాల్‌ పాల్గొన్నారు. బడ్జెట్‌ రోజున నిర్వహించిన వాకౌట్‌ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. అయితే ఆయనకి రావడంతో అసెంబ్లీని శానిటైజేషన్‌ చేపట్టారు.దీనితో అయనకి కాంటాక్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పటికే ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. దీనితో ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలని బయట నిర్వహించారు. అయితే ఇప్పటివరకూ ఇలా ఆరుబయట అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేదు. ఇక రేపటిలోగా బడ్జెట్‌ను ఆమోదించి సోమవారం నుంచి మిగిలిన సభ్యులు కూడా వైద్య పరిశీలనకు వెళ్లనున్నారు.

అటు దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 48,916 కేసులు నమోదు కాగా, 757 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 32,223 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 12,87,945 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,56,071 ఉండగా, 8,49,431 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 31,358 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 4,20,898 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 1,58,49,068 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories