Coronavirus Updates in India: భారత్‌లో కొత్తగా 48,916 కరోనా పాజిటివ్‌ కేసులు

Arun Chilukuri
Published on: 25 July 2020 9:44 AM IST
Coronavirus Updates in India: భారత్‌లో కొత్తగా 48,916 కరోనా పాజిటివ్‌ కేసులు
X
coronavirus (File Photo)

Coronavirus Updates in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 48,916 కేసులు నమోదు కాగా, 757 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 32,223 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 12,87,945 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,56,071 ఉండగా, 8,49,431 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 31,358 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 4,20,898 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 1,58,49,068 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story