వెలుగులతో కరోనాను తిప్పికొట్టే సంకల్పం తీసుకోవాలి.. ప్రధాని మోడీ

వెలుగులతో కరోనాను తిప్పికొట్టే సంకల్పం తీసుకోవాలి.. ప్రధాని మోడీ
x
Highlights

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి భారత దేశంలో తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం విజయవంతం అయింది. ఈ నిర్ణయం బాటలోనే ప్రపంచ దేశాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో 9...

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి భారత దేశంలో తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం విజయవంతం అయింది. ఈ నిర్ణయం బాటలోనే ప్రపంచ దేశాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో 9 రోజులుగా ప్రజలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఈరోజు ఉదయం తొమ్మది గంటలకు ప్రజలందరికీ వీడియొ సందేశం ఇచ్చారు. ఆ సందేశంలో ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే..

''లాక్ డౌన్ ప్రారంభమై 9 రోజులు గడిచాయి. కరోనపై యుద్ధం చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. వైద్య సిబ్బందికి మీరు కొట్టిన చప్పట్లను ప్రపంచం కీర్తిస్తోంది. భారతీయులంతా ఏకమై కరోనాను తరిమికొడతారు ప్రపంచమంతా ఇప్పుడు మన బాటలోనే నడుస్తోంది. జనతా కర్ఫ్యూ ద్వారా భారతీయులు తమ శక్తి సామర్ధ్యాలు ప్రపంచానికి చాటారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటె కరోనాను జయించినట్టే. ఏప్రిల్ 5 రాత్రి అందరూ తొమ్మిది నిమిషాల పాటు అందరూ ఇంట్లో దీపాలు ఆర్పేయండి. మీ తలుపులు మూసివేయండి. వీధి గుమ్మంలో అందరూ నిలబడండి. అందరూ కొవ్వొత్తి..టార్చిలైట్..ఇలా ఏది వీలయితే దానితో వెలుగును ప్రసారం చేయండి. అందరూ కల్సి కరోనా చీకట్ని తరిమి కొట్టగలమని సందేశాన్నివ్వండి. సాంఘిక దూరాన్ని పాటిస్తూనే ఈ కార్యక్రమం నిర్వహించండి. ఈ సందర్భంగా ఎవరూ రోడ్లమీడకు రావడం.. వీధుల్లో తిరగడం వంటి పనులు చేయకండి. ఈ ఆదివారం కరోనాను తిప్పికొట్టేలా సంకల్పం తీసుకోండి. భారత దేశ శక్తి సామర్ధ్యాలను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పండి.''

Show Full Article
Print Article
More On
Next Story
More Stories