వరుసగా 17వ రోజు కూడా పెరిగిన ఇంధన ధరలు

Samba Siva Rao
Updated on: 23 Jun 2020 11:35 AM IST
వరుసగా 17వ రోజు కూడా పెరిగిన ఇంధన ధరలు
X

దేశవ్యాప్తంగా వరుసగా 17వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. సోమవారం పెట్రోల్‌పై 33 పైసలు, డీజిల్‌పై 55 పైసలను పెంచిన చమురు సంస్థలు. మంగళవారం డీజిల్ ధర 55 పైసలు, పెట్రోల్ 20 పైసలు పెరుగుదల నమోదు చేశాయి.

గత 17 రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 8.50 పెరుగుదల నమోదు చేయగా, డీజిల్ ధర కూడా లీటరుకు రూ.10.00 పెరిగింది. రెండు వారాలుగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

పెంచిన ధరల ప్రకారం దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో...

లీటర్‌ పెట్రోల్‌ ధర :

చెన్నైలో 82.87రూపాయలు

♦ బెంగుళూరు 82.15 రూపాయలు

♦ ఢిల్లీలో 79.56 రూపాయలు

♦ కోల్‌కతా 81.27 రూపాయలు

♦ ముంబైలో 86.04 రూపాయలు

♦ హైదరాబాద్‌లో 82.59 రూపాయలు

లీటర్‌ డీజిల్‌ ధర :

♦ చెన్నైలో 75.80 రూపాయలు

♦ బెంగుళూరు 74.98రూపాయలు

♦ ఢిల్లీలో 78.85రూపాయలు

♦ కోల్‌కతాలో 74.14రూపాయలు

♦ ముంబైలో 77.24 రూపాయలు

♦ హైదరాబాద్‌లో 77.06రూపాయలు

Samba Siva Rao

Samba Siva Rao

Next Story