పాకిస్తాన్ రావల్పిండి లో ఘోర విమాన ప్రమాదం

K V D Varma
Updated on: 30 July 2019 12:25 PM IST
పాకిస్తాన్ రావల్పిండి లో ఘోర విమాన ప్రమాదం
X

పాకిస్తాన్ రావల్పిండి లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సైనిక శిక్షణ విమానం జనావాసాల మీద కుప్పకూలింది. దీంతో సుమారు 17 మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో 5 గురు సైనికులు, 12 మంది పౌరులు ఉన్నట్టు పాక్ ప్రభుత్వం తెలిపింది.

పలువురు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదు. విమానం శిక్షణలో భాగంగా గాలిలో చక్కర్లు కొడుతున్న సందర్భంలో రావల్పిండి నగర శివార్లలో నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. ప్రమాదానికి ముందు కంట్రోల్ రూమ్ తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. అయితే, అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.


K V D Varma

K V D Varma

Next Story