Sidhu: సోనియాకు 13 పాయింట్లతో సిద్ధూ లేఖ

‍‍Navjot Sidhu Letter With 13 Points to Sonia Gandhi
x
సోనియా గాంధీకి లేఖ రాసిన సిద్దు (ఫైల్ ఇమేజ్)
Highlights

Sidhu: నష్ట నివారణకు ఇదే చివరి అవకాశం అన్న సిద్ధు

Sidhu: పంజాబ్ కాంగ్రెస్‌ సంక్షోభానికి ఇంకా ఎండ్ కార్డ్ పడినట్లు లేదు. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య గొడవతో కాంగ్రెస్‌లో విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సిద్ధూ పట్టుతో అమరీందర్ రాజీనామా, కొత్త సీఎంగా చరణ్‌జీత్ బాధ్యతలు చేపట్టడం కూడా జరిగిపోయాయి. దీంతో సంక్షోభానికి శుభం కార్డు పడుతుందని భావించినప్పటికీ ఆ తర్వాత సిద్ధూ సైతం రాజీనామా చేయడంతో పరిణామాలు మాత్రం రోజుకో ట్విస్టుతో మారుతూనే ఉన్నాయి.

వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. ఎన్నికల్లో గెలుపుకోసం 13 పాయింట్ల అజెండాను అమలు చేయాలంటూ తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు. ఇవాళ ఆ లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు సిద్ధూ. దైవదూషణ కేసుల్లో న్యాయం, రాష్ట్రంలో మాదకద్రవ్యాల నివారణ, విద్యుత్ కష్టాలు, పీపీఏలు, వ్యవసాయ సమస్యలు, ఉపాధి కల్పన, ఇసుక మైనింగ్, ఎస్సీ-బీసీల సంక్షేమం, సింగిల్ విండో సిస్టమ్, మహిళలు-యువత సాధికారత, మద్యం, రవాణా రంగం, కేబుల్ మాఫియా వంటి సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని లేఖలో సోనియాను కోరారు.

మరోవైపు ఈ అంశాలన్నింటిపై మాట్లాడేందుకు, చర్చించేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాల్సిందిగా సోనియాను లేఖలో కోరారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు జరిగిన నష్టాన్ని నివారించేందుకు ఇదే చివరి అవకాశమని, ఇకనైనా వాటిని సరిచేసుకుంటే మంచిదని నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ లేఖలో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories