మీతో కలసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాం : ఇస్రో కు నాసా ట్వీట్

మీతో కలసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాం : ఇస్రో కు నాసా ట్వీట్
x
Highlights

చంద్రయాన్ 2 విఫలం కాలేదనీ.. కేవలం సాంకేతిక సమస్య మాత్రమె వచ్చిందనీ, అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని అంతర్జాతీయ పత్రికలు విపరీతంగా పోగుడుతున్నాయి. ఇక నాసా సంస్థ తమకు భారత్ పరిశోధనలు స్ఫూర్తినిచ్చాయంటూ చెబుతోంది.

అంతరిక్షంలో క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. మీరు చేసిన ప్రయత్నం గొప్పది అంటూ ఇస్రో కు అండగా నాసా నిలబడింది. చంద్రయాన్ 2 ప్రయోగంలో లాండర్ విక్రం చివరి నిమిషంలో సిగ్నల్స్ బ్రేక్ కావడం తెలిసిందే. అయితే, ఈ ప్రయోగం విఫలం కాలేదనీ, ఆర్బిటార్ చంద్రుని కక్ష్యలో విజయవంతంగా తిరుగుతోందనీ విదేశీ మీడియా చెబుతూ, భారత శాస్త్రవేత్తల కృషిని పొగుడుతోంది. ఇక అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అయితే, మీరు మాకు స్ఫూర్తిదాయకం అంటూ మన శాస్త్రవేత్తలనుద్దేశించి ట్వీట్ చేసింది.

'అంతరిక్షంలో పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి..చంద్రయాన్-2 వ్యోమనౌకను చంద్రుడి దక్షిణధ్రువంపై దింపడానికి ఇస్రోచేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం.. ఈ ప్రయోగంతో మాకు స్ఫూర్తినిచ్చారు.. భవిష్యత్తులో సౌర వ్యవస్థపై అన్వేషణకు కలిసి పనిచేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాం' అంటూ ట్వీట్ చేసింది.

ఇక అంతర్జాతీయ మీదియాదీ దాదాపు అదే మాటగా ఉంది. భారత శాస్త్రవేత్తలు చాలా కష్టపడ్డారంటూ కితాబిస్తున్నాయి పత్రికలు. భారత్ దశాబ్దాల కృషి, ఇంజినీరింగ్ ప్రతిభకు చంద్రయాన్-2 నిదర్శనమని, ఆర్బిటర్ తన కక్ష్యలోనే ఉండి పనిచేస్తుందని, ల్యాండర్ విక్రమ్ నుంచి సంకేతాలు రాకపోవడం విఫలమైనట్టు కాదని న్యూయార్క్ టైమ్స్ వ్యాఖ్యనించింది.

అయితే, కొద్దిసేపటి క్రితం ఇస్రో విక్రం ఆచూకీ దొరికిందని ప్రకటించింది. దానితో కమ్యూనికేషన్ కోసం ప్రయత్నిస్తున్నమనీ, త్వరలోనే సాధిస్తామని నమ్మకంగా ఉన్నట్టు ఇస్రో తెలిపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories