మన్ కీ బాత్‌లో టీమిండియాపై మోడీ ప్రశంసలు

Sandeep Eggoju
Published on: 31 Jan 2021 4:09 PM IST
Modi Praises Team India in Mann ki Baat
X

Representational Image

ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమంలో టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ నెలలో భారత జట్టు శుభవార్త అందించిందని అన్నారు. ఆస్ట్రేలియా టూర్లో ఆరంభంలో కష్టాలు ఎదుర్కొన్నా ఆపై అద్భుతంగా పుంజుకుని ఘనవిజయం సాధించారని కొనియాడారు. మన ఆటగాళ్ల కఠోరశ్రమ, సమష్టికృషి స్ఫూర్తిదాయకం అని ప్రశంసించారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ స్పందించింది. భారత జట్టు పట్ల ఎంతో ప్రోత్సాహకర వచనాలు పలికిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు అంటూ స్పందించింది. భారత త్రివర్ణ పతాకాన్ని సమున్నత రీతిలో రెపరెప లాడించేందుకు టీమిండియా దేన్నైనా సాధ్యం చేస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇటీవల ఆస్ట్రేలియా టూర్‌లో భారత్ తొలి టెస్టును ఓడిపోయిన తర్వాత అద్భుత రీతిలో పుంజుకుని చివరికి 2-1తో సిరీస్ ను గెలుచుకోవడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story