Bharat Bandh: జూన్‌ 10న భారత్‌ బంద్‌.. మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపు

Bharat Bandh: జూన్ 10 వ తేదిన దేశ‌వ్యాప్తంగా బంద్ పాటించాల‌ని కోరుతూ మావోయిస్టు కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక లేఖ‌ను విడుద‌ల చేశారు.

Arun Chilukuri
Published on: 31 May 2025 5:09 PM IST
Bharat Bandh
X

Bharat Bandh: జూన్‌ 10న భారత్‌ బంద్‌.. మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపు

Bharat Bandh: మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్ట్ లు భార‌త్ బంద్ కు పిలుపు ఇచ్చారు. జూన్ 10 వ తేదిన దేశ‌వ్యాప్తంగా బంద్ పాటించాల‌ని కోరుతూ మావోయిస్టు కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక లేఖ‌ను విడుద‌ల చేశారు.

2024 నుంచి ఇప్పటి వరకు 540 మంది మావోయిస్టులు మృతి చెందారని అ లేఖ‌లో పేర్కొన్నారు.. శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినా కేంద్రం ఆపరేషన్ కగార్ ఆపడంలేద‌ని వివ‌రించారు.. రెండు నెల‌లుగా సంయమనం పాటిస్తున్నా కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పంద‌న రాలేద‌ని పేర్కొన్నారు.

కేంద్ర, రాష్ట్రాల ఫాసిస్ట్‌ వైఖరికి నిరసనగా బంద్ కు పిలుపు ఇస్తునట్లు చెప్పారు.. అలాగే జూన్‌ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వ‌హిస్తున‌ట్లు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story