Corona: కర్ణాటక సీఎంకు రెండోసారి కరోనా

Corona: రోజురోజుకూ పెరిగిపోతున్న కేసుల సం‌ఖ‌్య * కరోనా బారినపడుతున్న పొలిటికల్ లీడర్స్‌

Sandeep Eggoju
Updated on: 16 April 2021 9:30 PM IST
Corona Positive to Karnataka Chief Minister Yediyurappa
X
కర్ణాటక సీఎం యెడ్యూరప్ప (ఫైల్ ఇమేజ్)

Corona: భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూపోతోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరు కోవిడ్‌ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే యూపీ సీఎం ఆదిత్యనాధ్, కేరళ సీఎం పినరయి విజయన్‌తో సహా పలువురు పొలిటికల్ లీడర్స్‌కు కరోనా సోకగా, ఈ జాబితాలో కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా చేరారు. తనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని యడియూరప్ప స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జ్వరంతో ఇబ్బంది పడుతోన్న యడియూరప్పను బెంగళూరు మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. అయితే, రెండోసారి కరోనా బారిన పడటంతో యడియూరప్ప ఆరోగ్యంపై అధిక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story