'నేను ఒక భారతీయుడిని' .. తమిళ వ్యక్తి అన్న వ్యాఖ్యాతకు 'ఇస్రో ఛైర్మన్ శివన్' అద్భుత సమాధానం

నేను ఒక భారతీయుడిని .. తమిళ వ్యక్తి అన్న వ్యాఖ్యాతకు ఇస్రో ఛైర్మన్ శివన్ అద్భుత సమాధానం
x
Highlights

ఇస్రో ఛైర్మన్ శివన్ పేరు ఇప్పుడు దేశమంతా మారుమోగుతోంది. చంద్రయాన్ 2 ప్రయోగంతో ఆయన దేశ కీర్తిని ప్రపంచం అంతా ప్రతిధ్వనించేలా చేశారు. ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపి గతంలోనే చరిత్ర సృష్టించిన శివన్ ఇప్పుడు చంద్రయాన్ 2 విషయంలోనూ మరోసారి సంచలనం సృష్టించారు.

ఇస్రో ఛైర్మన్ శివన్ పేరు ఇప్పుడు దేశమంతా మారుమోగుతోంది. చంద్రయాన్ 2 ప్రయోగంతో ఆయన దేశ కీర్తిని ప్రపంచం అంతా ప్రతిధ్వనించేలా చేశారు. ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపి గతంలోనే చరిత్ర సృష్టించిన శివన్ ఇప్పుడు చంద్రయాన్ 2 విషయంలోనూ మరోసారి సంచలనం సృష్టించారు. ఇక ఆయనను పలువురు ప్రశంసిస్తున్నారు. ఆయన తో పలు టీవీ చానెల్స్ ముఖాముఖీలు ప్రసారం చేస్తున్నాయి. తాజాగా ఓ చానెల్ లో అయన ఇంటర్వ్యూ ప్రసారం అయింది. ఇందులో అయన యాంకర్ కు చెప్పిన సమాధానం ఇప్పుడు నేట్టింట్లో అందరి మనసులూ దోచుకుంది. ఆ ఇంటర్వ్యూలో "ఇంత గొప్ప స్థానంలో ఉన్న ఒక తమిళ వ్యక్తిగా తోటి తమిళులకు మీరు ఏం చెప్పదలచుకున్నారు" అని యాంకర్ అడిగారు. దానికి శివన్ "నేను ఇస్రోలో ఒక భారతీయుడిగా చేరాను. అన్ని మతాలు, స్తాంతాలు, భాషలకు చెందిన వ్యక్తులు ఇస్రోలో పని చేస్తున్నారు. స్తాజెక్టుల్లో తమ వంతు సహకారాన్ని

అందిస్తున్నారు. అయితే నన్ను తమ వాడిగా భావిస్తున్న నా సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అంటూ ఇచ్చిన సమాధానం యావత్ దేశ ప్రజలకూ సంతోషాన్నిచ్చింది. శివన్ పై ఉన్న అభిమానాన్ని రెట్టింపు చేసింది. రైతు బిడ్డగా పుట్టి దేశం గర్వించే స్థాయి శాస్త్రవేత్తగా ఎదిగినా అయన ఒదిగి ఉండే విధానం అందరి మనసుల్నీ గెలుచుకుంది.

ఇప్పుడు శివన్‌ చెప్పిన సమాధానానికి ట్విటర్‌లో ప్రశంసల వర్షం కురుస్తోంది. స్తాంతం, భాష, మతం ఏదైనా ఇస్రో కీర్తిని ఇనుమడింపజేస్తున్న శివన్‌ని చూసి యావత్‌ దేశం గర్వపడుతోందని ఆయన్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇప్పటికే చంద్రయాన్‌-2లోని విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి సంకేతాలు నిలిచిపోయాయన్న బాధతో శివన్‌ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకోవడం, ఆయన్ని ప్రధాని మోదీ హత్తుకొని ఓదార్చిన సంఘటన నెటిజన్లను ద్రవింపజేసిన విషయం తెలిసిందే. శివన్‌ కన్నీటిలో నిజాయతీ ఉందంటూ నెటిజన్లు ఆయన్ను కృషిని కొనియాడారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories