Corona Cases In India: కొత్త కేసులు3.68 లక్షలు... మరణాలు3.417

Corona Cases In India: గత 24 గంటల్లో కొత్త‌గా కరోనాతో మరణాల సంఖ్య మరోసారి 3 వేలకు పైనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Kranthi
Updated on: 3 May 2021 12:19 PM IST
India Reports 368147 New Covid19 Cases
X

కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం

Corona Cases In India: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే వుంది. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్త‌గా కరోనాతో మరణాల సంఖ్య మరోసారి 3 వేలకు పైనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం తాజాగా గడచిన 24 గంట‌ల సమయంలో దేశవ్యవాప్తంగా15,04,698 మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా 3,68,147 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,99 కోట్లకు చేరింది. అయితే కోవిడ్ వల్ల 3,417 మంది కోవిడ్ వల్ల మృత్యువాత పడ్డారు.

గత 24 గంటల వ్యవధిలో మరో 3,00,732 మంది కోవిడ్ ను జయించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు 1.62 కోట్ల మంది కరోనా నుంచి కోలుకోగా రికవరీ రేటు 81.77శాతం ఉంది. చాలా చోట్ల టీకాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం కేవలం 12 లక్షల మందికి మాత్రమే టీకా ఇవ్వగా ఇప్పటి వరకు 15.71కోట్ల మంది తీసుకున్నారు.

క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గింది. అయితే, వైరస్ నిర్ధారణ పరీక్షలు తగ్గడం వల్లే కేసుల సంఖ్య తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాకాల ద్వారా స్పష్టమవుతోంది. కొత్త కేసులు పెరుగుతుండటంతో దేశంలో క్రియాశీల కేసులు 34 లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 34,13,642 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

Kranthi

Kranthi

Next Story