Emmanuel Macron: గణతంత్ర వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా ఫ్రాన్స్ అధ్యక్షుడు

Emmanuel Macron: ఇవాళ భారత్‌కు చేరుకోనున్న ఇమ్మాన్యుయేల్ మాక్రాన్

Jyothi
Published on: 25 Jan 2024 11:23 AM IST
French President Emmanuel Macron will attend India
X

Emmanuel Macron: గణతంత్ర వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా ఫ్రాన్స్ అధ్యక్షుడు

Emmanuel Macron: రేపు జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ హాజరవుతున్నారు. ఇందులో భాగంగా నేడు భారత్‌ చేరుకోనున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌ ఎయిర్‌పోర్టులో ఫ్రెంచ్‌ అధినేత దిగనున్నారు. ఆయనకు ప్రధాని మోడీ స్వాగతం పలుకనున్నారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి జైపూర్‌లో ర్యాలీ నిర్వహించనున్నారు. అదేవిధంగా పింక్‌ సిటీలో పలు పర్యాటక ప్రవేశాలను సందర్శిస్తారు. గురువారం రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు.

గణతంత్ర వేడుకల తర్వాత రాజ్‌భవన్‌లో ఎట్‌ హోం కార్యక్రమంలో పాల్గొంటారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్ వస్తున్న ఆరో అధ్యక్షుడిగా మాక్రాన్ నిలవనున్నారు. ఇక మాక్రాన్‌ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌తో పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. ముఖ్యంగా రక్షణ, భద్రత, క్లీన్‌ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త సాంకేతికతోపాటు ఇతర రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరుగనున్నట్లు సమాచారం.

Jyothi

Jyothi

Next Story