Fire Accident: చెన్నైలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులు

Fire Accident: అందర్‌కుప్పంలో ఓ పెయింట్‌ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు

Jyothi
Published on: 1 Aug 2023 7:45 PM IST
Fire Accident In Chennai
X

Fire Accident: చెన్నైలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులు

Fire Accident: చెన్నైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అందర్‌కుప్పంలోని ఓ పెయింట్‌ ఫ్యాక్టరీలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మంటలు ఎగసిపడ్డాయి. 8 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్టు సమాచారం. రంగంలోకి దిగిన తోటి కార్మికులు, స్థానికులు.. కార్మికులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనాస్థలంలో దట్టమైన పొగ కమ్మేయడంతో.. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది.. మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story