TOP 6 NEWS @ 6PM: అమెరికా అప్పు తీర్చేందుకు విదేశీయులకు గోల్డ్ కార్డ్ అమ్మకం.. ఒక్కో గోల్డ్ కార్డ్ ధర ఎంతంటే..

Donald Trump says Gold card scheme to replace existed EB-5 immigrant investor visa program, what is it and why
x

అమెరికా అప్పు తీర్చేందుకు విదేశీయులకు గోల్డ్ కార్డ్ అమ్మకం.. ఒక్కో గోల్డ్ కార్డ్ ధర ఎంతంటే..

Highlights

1) MARCOS: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. రంగంలోకి మార్కోస్ టీమ్ ఎస్‌ఎల్‌బీసీలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి....

1) MARCOS: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. రంగంలోకి మార్కోస్ టీమ్

ఎస్‌ఎల్‌బీసీలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో నీరు, బురద కారణంగా ప్రమాద స్థలానికి చేరుకోవడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు. సొరంగంలో సుమారు 7 నుంచి 9 మీటర్ల ఎత్తుకు మట్టి పేరుకుపోయిందరి వివరించారు. రెస్క్యూ ఆపరేషనల్‌లో ఇప్పటికే ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు పాల్గొన్నాయి.

సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు మార్కోస్‌ను రంగంలోకి దింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ (మార్కోస్ ) బృందం నింగి, నేల, నీటిలో రెస్క్యూ ఆపరేషన్ చేయడంలో ప్రత్యేక శిక్షణ పొందింది. ఈ బృందాన్ని రంగంలోకి దింపితే కార్మికులను క్షేమంగా బయటకు తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2) ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి భేటీలో చర్చకొచ్చిన అంశాలు ఏంటంటే...

Revanth Reddy meets PM Modi: ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. గంటకుపైగా వీరిద్దరి మధ్య ఈ భేటీ జరిగింది. ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి నాయుడు, డీజీపీ జితేందర్ కూడా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఈ భేటీలో పాల్గొన్నారు.

ఇక ఈ సమావేశంలో చర్చకొచ్చిన అంశాల విషయానికొస్తే... ఎస్ఎల్ బీసీ సొరంగం వద్ద జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ గురించి సీఎం రేవంత్ ప్రధాని మోదీకి వివరించారని తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ మెట్రో విస్తరణ పనులు, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ స్టేటస్, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులకు కేంద్రం తరపున ఆర్థిక సహాయం అందించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3) మహా శివరాత్రి వేళ విషాదం... గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు

Tragedy on Maha Shivaratri: మహా శివరాత్రి వేళ తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటుచేసుకుంది. స్నానం చేసేందుకు గోదావరిలోకి దిగిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు మొదలుపెట్టారు. గత ఈతగాళ్ల సాయంతో వారి ఆచూకీ కోసం వెతకగా నలుగురి మృతదేహాలు లభించాయి. మరొకరు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. గల్లంతయిన యువకులను పవన్, ఆకాష్, దుర్గా ప్రసాద్, పడాల సాయి, తిరుమలశెట్టి పవన్ గా గుర్తించారు.

మహా శివరాత్రి వేళ పవిత్ర స్నానం చేద్దామని 11 మంది యువకులు తాడిపూడిలో గోదావరిలో దిగారు. అయితే, ఇసుక మేటల్లో ముగ్గురు చిక్కుకోగా వారిని రక్షించే ప్రయత్నంలోనే మరో ఇద్దరు యువకులు కూడా అందులోకి జారుకున్నట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఐదుగురు యువకులు గోదావరిలో గల్లంతు అవడంతో మిగతా ఆరుగురు యువకులు నీళ్లలోంచి బయటికి వచ్చి స్థానికులకు సమాచారం అందించారు.

4) India Pollution: కాలుష్యం ముప్పు.. అత్యంత కాలుష్యం కలిగిన దేశాల్లో టాప్3లో భారత్

India Pollution: ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం కోరలు చాస్తోంది. మానవ మనుగడతో పాటు జీవకోటి మనుగడలో కీలకపాత్రను పోషించిన సహజ వనరులు అన్నీ కలుషితమై జీవ మనుగడకు విఘాతంగా మారిపోతున్నాయి. గాలి, నీరు, ఆహారం పెద్ద ఎత్తున కలుషితమై పోతున్నాయి. నదులన్నీ కలుషిత వ్యర్థాలను మోసుకుపోయే మురికి కాలువలుగా మారిపోతున్నాయి. ఇక అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ టాప్3లో నిలిచింది.

భారత్‌లో కాలుష్యం ఊహించని రీతిలో పెరిగిపోతుంది. దేశమంతా కాలుష్యం కోరలు చాస్తోంది. ప్రపంచలోనే అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ టాప్ 3లో నిలవడమే ఇందుకు నిదర్శనం. రియల్ టైమ్ గాలి నాణ్యత వివరాలను అందజేసే ఓపెన్ సోర్స్ సంస్థ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2024లో కాలుష్య దేశాల జాబితాను విడుదల చేసింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ జాబితాలో భారత్ 3వ స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) ICC Rankings: ఒక్క మ్యాచ్‌తో అందరి ర్యాంకింగ్స్ తలకిందులు చేసిన విరాట్ కోహ్లీ

ICC Rankings: ఐసీసీ బుధవారం విడుదల చేసిన కొత్త వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. టీం ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. అతను ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. పెద్ద విషయం ఏమిటంటే అతను తన రేటింగ్ పాయింట్లను మరింత మెరుగుపరుచుకున్నాడు. విరాట్ కోహ్లీ ఒక స్థానం పైకి ఎగబాకి ఐదోస్థానాన్ని ఆక్రమించాడు.

విరాట్ కోహ్లీ పాకిస్థాన్‌పై సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇన్నింగ్స్ కు సంబంధించిన ప్రతిఫలం ఇప్పుడు పొందాడు. విరాట్ కోహ్లీ డారిల్ మిచెల్‌ను అధిగమించి 6వ స్థానం నుండి 5వ స్థానానికి ఎగబాకాడు. బాబర్ ఆజమ్ గత వారం నంబర్ 1 వన్డే బ్యాట్స్‌మన్ టైటిల్‌ను కోల్పోయాడు. ఇప్పుడు ఈ బాబార్ ఆజమ్ నంబర్ 2 స్థానాన్ని కూడా కోల్పోవచ్చు ఎందుకంటే తనకు భారత కెప్టెన్ రోహిత్ శర్మకు మధ్య పెద్దగా తేడా లేదు. బాబర్ 770 రేటింగ్ పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 757 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. పెద్ద విషయం ఏమిటంటే హెన్రిచ్ క్లాసెన్ 749 పాయింట్లతో నాల్గవ స్థానంలో, విరాట్ కోహ్లీ 743 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) What is Gold Card: విదేశీ ధనవంతులకు గోల్డ్ కార్డ్స్ అమ్ముతాం - డోనల్డ్ ట్రంప్

Gold Cards Scheme, it's price and advantages: అమెరికాకు ఆదాయం పెంచుకునేందుకు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. అందులో భాగంగానే కొత్తగా గోల్డ్ కార్డ్స్ స్కీమ్‌ను తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే కొన్ని దేశాల నుండి వచ్చే దిగుమతులపై భారీగా సుంకం రాబడుతున్న ట్రంప్ తాజాగా గోల్డ్ కార్డ్స్ కూడా అమ్ముతాం అంటున్నారు.

ట్రంప్ చెప్పిన వివరాల ప్రకారం బాగా డబ్బున్న విదేశీయులు అమెరికాలో ఈ గోల్డ్ కార్డ్స్ కొనుగోలు చేయవచ్చు. ఒక్కో గోల్డ్ కార్డ్ ధర 50 లక్షల డాలర్లుగా నిర్ణయిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అంటే ఇండియన్ కరెన్సీలో ఇది 43 కోట్ల 53 లక్షలకు సమానం. ఈ గోల్డ్ కార్డ్ కొనుగోలు చేసిన విదేశీయులకు అమెరికా పౌరసత్వం, శాశ్వత నివాస హక్కు వచ్చినట్లేనని ట్రంప్ అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories