MARCOS: ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రమాదం.. రంగంలోకి మార్కోస్

Navys Marcos Join Rescue Operation As 8 Workers Remain Trapped
x

ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రమాదం.. రంగంలోకి మార్కోస్

Highlights

ఎస్‌ఎల్ బీసీలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో నీరు, బురద కారణంగా ప్రమాద స్థలానికి చేరుకోవడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు.

ఎస్‌ఎల్ బీసీలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో నీరు, బురద కారణంగా ప్రమాద స్థలానికి చేరుకోవడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు. సొరంగంలో సుమారు 7 నుంచి 9 మీటర్ల ఎత్తుకు మట్టి పేరుకుపోయిందరి వివరించారు. రెస్క్యూ ఆపరేషనల్‌లో ఇప్పటికే ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు పాల్గొన్నాయి.

సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు మార్కోస్‌ను రంగంలోకి దింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ (మార్కోస్ ) బృందం నింగి, నేల, నీటిలో రెస్క్యూ ఆపరేషన్ చేయడంలో ప్రత్యేక శిక్షణ పొందింది. ఈ బృందాన్ని రంగంలోకి దింపితే కార్మికులను క్షేమంగా బయటకు తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఎస్‌ఎల్ బీసీ టన్నెల్ వద్ద బుధవారం నాలుగు ముఖ్యమైన ఆపరేషన్లు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. టన్నెల్ లోపలికి వెళ్లేందుకు తోడ్పడే కన్వేయర్ బెల్ట్‌కు మరమ్మతు చేసి పునరుద్దరించే ప్రయత్నంలో ఉన్నారు. టన్నెల్ కూలడంతో ధ్వంసమైన బోరింగ్ మిషన్‌ను కట్ చేసి బయటకు తీసుకురానున్నట్టు చెప్పారు. సొరంగంలో ఊరుతున్న నీటిని భారీ మోటార్ల సాయంతో ఎప్పటికప్పుడు తోడేస్తున్నారు. బురదను డీసీల్టింగ్ చేస్తూ ప్రమాద స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని రెస్క్యూ అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories