కరోనా 'మహా' ఉదృతి

S. Srikanth
Updated on: 13 Jun 2020 8:28 PM IST
కరోనా మహా ఉదృతి
X
Representational Image

* తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1989 పాజిటివ్ కేసులు, 30 మరణాలు సంభవించాయి. దీనితో తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 42687కి చేరింది. ఇప్పటివరకు 397 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనాతో పోరాడి రాష్ట్రంలో 23,403 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 18878 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్సపొందుతున్నారు.

* కర్ణాటకలో‌‌ కరోనా కేసులు ఎక్కడ కూడా తగ్గడం లేదు. గత 24 గంటల్లో 308 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం మీద కర్ణాటక కరోనా కేసుల సంఖ్య 6824కు పెరిగాయి. ఇప్పటివరకు కరోనాతో 81 మంది చనిపోయారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 3648 గా ఉంది. ఇప్పటివరకు 3648 మంది కోలుకున్నారు.

* కేరళ గత 24 గంటల్లో 85 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ వైరస్‌ బారిన పడినవారిలో1045 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కేరళలో ప్రస్తుతం 1342 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు వైద్యశాఖ వెల్లడించింది.

* మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 3,427 పాజిటివ్ కేసులు. దీనితో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 1,04,568కి చేరింది. కొత్తగా 113 మరణాలు సంభవించాయి.

S. Srikanth

S. Srikanth

Next Story