Coronavirus Updates in India: భారత్‌లో కొత్తగా 92,605 పాజిటివ్ కేసులు...

Coronavirus Updates in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

S. Srikanth
Published on: 20 Sept 2020 10:11 AM IST
Coronavirus Updates in India: భారత్‌లో కొత్తగా 92,605 పాజిటివ్ కేసులు...
X

Coronavirus Updates in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 54 లక్షల 620కి చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో రికార్డ్ స్థాయిలో 92,605 కేసులు నమోదు కాగా, 1,133 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 94,612 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 54,00,620 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 10,10,824 ఉండగా, 43,03,043 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 86,752 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 79.28 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.61 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 19.52 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 6,36,61,060 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.


S. Srikanth

S. Srikanth

Next Story