Coronavirus Updates in India: భరత్ లో 12 లక్షలు దాటిన కరోనా కేసులు..

Coronavirus Updates in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

S. Srikanth
Published on: 23 July 2020 10:00 AM IST
Coronavirus Updates in India: భరత్ లో 12 లక్షలు దాటిన కరోనా కేసులు..
X
Coronavirus

Coronavirus Updates in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 45,720 కేసులు నమోదు కాగా, 1129 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 29,557 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 12,38,635 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,26,167 ఉండగా, 7,82,606 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 29,861 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశంలోనే అత్యదికంగా తమిళనాడులో 444 మంది కరోనా బారిన పడి మరణించారు. బుధవారం లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా 3,43,243 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు.. అలాగే నిన్నటి(బుధవారం) వరకు దేశంలో 1,47,24,546 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.


S. Srikanth

S. Srikanth

Next Story