Coronavirus Updates: భారత్‌లో కొత్తగా 15,413 కరోనా పాజిటివ్‌ కేసులు

S. Srikanth
Updated on: 21 Jun 2020 11:07 AM IST
Coronavirus Updates: భారత్‌లో కొత్తగా 15,413 కరోనా పాజిటివ్‌ కేసులు
X
Representational Image

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 15,413 కేసులు నమోదు కాగా, 306 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 4,10,461 కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,69,451ఉండగా, 2,27,755 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 13,254 మంది కరోనా వ్యాధితో మరణించారు. దేశంలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 68,07,226. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన టెస్టుల సంఖ్య 1,90,730


S. Srikanth

S. Srikanth

Next Story