దేశరాజధానిలో కరోనా పంజా.. 66,602 పాజిటివ్ కేసులు.. ఒక్క రోజే 3947 కేసులు

Samba Siva Rao
Published on: 23 Jun 2020 10:00 PM IST
దేశరాజధానిలో కరోనా పంజా.. 66,602 పాజిటివ్ కేసులు.. ఒక్క రోజే 3947 కేసులు
X
Representational Image

దేశరాజధానిలో అత్యధికంగా ఇవాళ ఒక్క రోజే 3947 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటలలో 68 మంది మృతి చెందారు. గడచిన 24 గంటలలో 2711మంది వివిధ హాస్పటల్స్ ఢిశ్చార్జ్ అయ్యారు.

దేశరాజధానిలో ఇప్పటివరకు నమోదయిన కేసుల సంఖ్య 66,602, మరణాల సంఖ్య 2301గా వుంది. ఇప్పటి వరకు చికిత్స పూర్తిచేసుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 39,313 కాగా.. ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 24,988గా ఉంది. ఢిల్లీ లో ఈరోజు నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 16,952 ఉంది.

దేశరాజధానిలో ఇప్పటి వరకు 4,01,648 కరోనా టెస్ట్ లు నిర్వహించారు. ఢిల్లీ కరోనా కేసులు అత్యధికంగా 261 కంటైన్మెంట్ జోన్లు వున్నాయి. కరోనా రోగులకు వివిధ హాస్పటల్ లలో అందుబాటులో ఉన్న బెడ్ల సంఖ్య 13,389. ఖాళీగా ఉన్న బెడ్ల సంఖ్య 712గా ఉంది.




Samba Siva Rao

Samba Siva Rao

Next Story