Coronavirus: దేశవ్యాప్తంగా కరోనా స్లో డౌన్ స్టార్ట్

Coronavirus Slow Down Start in All Over India
x

కరోన వైరస్ 

Highlights

Coronavirus: క్రమంగా తగ్గుతున్న పాజిటివ్‌ కేసుల సంఖ్య * ఈ నెలాఖరుకు కంట్రోల్‌లోకి కరోనా..!

Coronavirus: దేశవ్యాప్తంగా కరోనా స్లో డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల చివరికల్లా పరిస్థితి మరింత అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో, రాష్ట్రంలో వైరస్ పీక్ స్టేజ్​ పూర్తయి, కేసుల్లో తగ్గుదల మొదలైందని సైంటిస్టులు అంచనా వేశారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో రెండు వారాలుగా లాక్‌‌‌‌డౌన్ అమలవుతోంది. కరోనా కట్టడికి ఇది చాలా ఉపయోగపడిందని డాక్టర్లు చెబుతున్నారు. వారం రోజులుగా ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్​ సహా 18 రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం స్పల్పంగా పెరుగుదల ఉంది. వైరస్ వ్యాప్తి తగ్గుతున్నట్టు గ్రౌండ్​లెవల్​లో పనిచేసే డాక్టర్లు చెప్తున్నారు. తెలంగాణలో ఈ పది రోజుల లాక్‌‌‌‌డౌన్ తర్వాత మరింత తగ్గొచ్చంటున్నారు.

దేశ రాజధాని ఢిల్లీ కుదుటపడుతోంది. రెండు రోజులుగా కేసులు పదివేలలోపే ఉంటున్నాయి. శనివారం కొత్తగా 6వేల 430 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 10 తర్వాత ఇదే అత్యల్పం. పాజిటివ్‌ రేటు 11.32గా నమోదైంది. ఇదంతా లాక్‌డౌన్‌ ఫలితమేనంటున్నారు వైద్య నిపుణులు. ఢిల్లీలో ఏప్రిల్‌ 19న లాక్‌డౌన్‌ ప్రారంభమైంది. అప్పటికి పాజిటివ్‌ రేటు 36గా ఉంది. లాక్‌డౌన్‌ అమలు తర్వాత నుంచి వైరస్‌ ఉధృతి క్రమంగా తగ్గడం మొదలైంది. టీకా పంపిణీ సైతం.. వైర్‌సకు అడ్డుకట్ట వేయడంలో తనవంతు పాత్ర పోషించిందని, హెర్డ్‌ ఇమ్యూనిటీ కూడా కేసుల తగ్గుదలకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఢిల్లీలో మరణాలు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి. 337 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రితం రోజుకు ఇవి 48 అధికం.

కర్ణాటకలో మరోసారి మహారాష్ట్ర కంటే ఎక్కువ పాజిటివ్‌లు వచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లో ఇవాళ్టి నుంచి 15 రోజుల సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఛత్తీ‌సగఢ్‌లోని 31 జిల్లాల్లోనూ ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు. హిమాచల్‌లో ఈ నెల 26 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా రోగులకు 50 శాతం పడకల కేటాయింపు నిబంధనను ఉల్లంఘించడంపై గోవా ప్రభుత్వం తీవ్ర చర్యకు దిగింది. రాష్ట్రంలోని మొత్తం 21 ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా రోగుల ప్రవేశాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది.

ఈ నెల మూడో వారంలో కరోనా డిక్రీజింగ్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందని చాలా సంస్థలు అంచనా వేశాయి. దేశంలో రికవరీ రేట్‌‌‌‌ 79 శాతానికి వచ్చాక కరోనా పీక్‌‌‌‌ నమోదవుతుందని, ఆ తర్వాత తగ్గుదల మొదలవుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్‌‌‌‌లోనే ఒక రిపోర్ట్‌‌‌‌ను విడుదల చేసింది. మే మూడో వారంలో రికవరీ రేట్ 79 శాతానికి వస్తుందని ఆ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొంది. శనివారం నాటికి దేశంలో 83 శాతం రికవరీ రేట్ నమోదైంది. ఈ లెక్కన ఎస్‌‌‌‌బీఐ రిపోర్ట్‌‌‌‌ నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, కేంబ్రిడ్‌‌‌‌ యూనివర్సిటీ కూడా మే నెల మధ్యలో పీక్ స్టేజ్ వస్తుందని నెల రోజుల కింద ప్రకటించాయి. పీక్ టైమ్‌‌‌‌లో రోజుకు ఐదు వేల మరణాలు నమోదవుతాయని ఆయా సంస్థలు అంచనా వేశాయి. ఐసీఎంఆర్‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌లోని సీసీఎంబీ, ఎన్‌‌‌‌ఐఎన్ వంటి సంస్థలు మే రెండో వారంలో పీక్ నమోదవుతుందని, మే చివరి వరకూ కంట్రోల్‌‌‌‌లోకి వస్తుందని ప్రకటించాయి. ఈ అంచనాలన్నీ నిజమయ్యే సూచనలే కనిపిస్తున్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories