కరోనా కట్టడికి కేంద్రం చర్యలు.. 15 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు..

కరోనా కట్టడికి కేంద్రం చర్యలు.. 15 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు..
x
Highlights

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సాయంగా 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50కి పైగా జిల్లాలు, నగరపాలక,...

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సాయంగా 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50కి పైగా జిల్లాలు, నగరపాలక, మున్సిపాల్టీలకు అత్యున్నత కేంద్ర బృందాలను పంపాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మహారాష్ట్ర (7) తెలంగాణ (4), తమిళనాడు (7), రాజస్థాన్ (5), అస్సాం (6), హర్యానా (4), గుజరాత్ (3), కర్ణాటక (4), ఉత్తరాఖండ్ (3), మధ్యప్రదేశ్ (5), పశ్చిమ బెంగాల్ (3), ఢిల్లీ(3), బీహార్ (4), ఉత్తర ప్రదేశ్ (4), ఒడిశా (5) జిల్లాలు/మున్సిపాలిటీలకు కేంద్ర బృందాలు.

ముగ్గురు సభ్యులతో ఒక్కో బృందం ఏర్పాటు. బృందంలో ప్రజారోగ్య నిపుణులు/ఎపిడెమియాలజిస్టులు / వైద్యులు/ సీనియర్ జాయింట్ సెక్రటరీ స్థాయి నోడల్ అధికారి. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తు జిల్లాలు నగరాల్లోని కేసుల నియంత్రణ చర్యలు, సమర్థవంతమైన చికిత్స , క్లినికల్ నిర్వహణలో రాష్ట్ర ఆరోగ్య శాఖకు తోడ్పడటం సహా ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను పరిశీలించనున్న కేంద్ర బృందాలు. మెరుగైన సమన్వయం, కరోనా ప్రభావిత ప్రాంతాల్లో త్వరితగతిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్రాలతో సమన్వయం చేస్తున్న కేంద్ర బృందాలతో సన్నిహితంగా ఉండాలని సూచించిన కేంద్రం.

కరోనా పరీక్షల నిర్వహణలో అవరోధాలు, తక్కువ పరీక్షలు , అధిక పరీక్ష నిర్ధారణ రేటు,వచ్చే రెండు నెలల పాటు పెరిగే కేసులు,బెడ్ల కొరత, పెరుగుతున్న కేసు మరణాల రేటు, అధిక రెట్టింపు రేటు, కేసులలో ఆకస్మిక పెరుగుదల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చర్యల కోసం రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో సహాయం అందించనున్న కేంద్ర బృందాలు.

కేంద్ర బృందంతో క్రమం తప్పకుండా సమన్వయం చేసుకోవడానికి జిల్లా స్థాయిలో వైద్య పరిపాలనా అధికారులతో కూడిన ప్రత్యేక కోర్ బృందాన్ని అధికారికంగా ఏర్పాటు చేసుకున్న అనేక జిల్లాలు, మునిసిపాలిటీలు.

Show Full Article
Print Article
Next Story
More Stories